సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఫొటోజయలలిత కూతురుగా ప్రచారంవిస్టరీ విప్పిన గాయిని చిన్మయి
ఈ ఫొటో చూశారా... ఈమె దివంగత ముఖ్యమంత్రి జయలలిత కూతరు అంటూ గత కొన్నాళ్లుగా ఒక మహిళ ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
2014 లో అమ్మ ఆస్పత్రి పాలైనప్పటి నుంచి ఈ రూమర్ ప్రచారం అవుతూనే ఉంది.
ఇప్పుడు అమ్మ మృతితో మళ్లీ సోషల్ మీడియాలో ఈ టాపిక్ పై జోరుగా చర్చ సాగుతోంది.
ఈమె జయలలిత కూతురని, సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేశారని, ప్రస్తుతం అమెరికాలో ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంటున్నారని ఆమె ఫొటోను సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు.కొందరైతే ఆమె జయలలిత కూతరు అని నిర్దారించేశారు కూడా.
అయితే ఈ ఫొటో లో ఉన్నది ఎవరనే మిస్టరీని ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీపాద చిన్మయి విప్పింది.
జయలలితకు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఫొటోకు ఏలాంటి సంబంధం లేదని ప్రకటిచింది. తన ఫేస్‌బుక్ పోస్టులో చిన్మయి వెల్లడిచింది.
ఆమె పేరు దివ్యా రామనాథన్ వీరరాఘవన్ అని. జయలలిత కూతురు కానే కాదని స్పష్టం చేసింది. అంతేకాదు ఆమె ఆస్ట్రేలియాలో తన భర్తతో కలిసి నివసిస్తున్నట్లు వెల్లడించింది. వాళ్లు కుటుంబం తమకు బాగా సన్నిహితమని, శాస్త్రీయ సంగీత కుటుంబం నుంచి వచ్చారని పేర్కొంది.
