గడచిన 75 రోజులుగా ఆసుపత్రిలో మృత్యువును జయించేందుకు అలుపెరుగని పోరాటం చేసిన జయలలిత సోమవారం లొంగిపోయారు.
తమిళనాడుకు ఐదు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి అభిమానుల గుండెల్లో పురట్చితలైవిగా కొలువు తీరిన తమిళ ‘అమ్మ’ జయలలిత ఇక లేరు. కోట్లాదిమంది అభిమానులను, పార్టీ నేతలు, కార్యకర్తలను ఆదేధనకు గుకిచేస్తూ మంగళవారం తిరిగిరాని లోకాలకు శాస్వతంగా వెళ్లిపోయారు. గడచిన 75 రోజులుగా ఆసుపత్రిలో మృత్యువును జయించేందుకు అలుపెరుగని పోరాటం చేసిన జయలలిత సోమవారం లొంగిపోయారు. దాంతో తమిళ లోకం ఒక్కసారిగా శోకసముద్రంలో ముణిగిపోయింది.
సెప్టెంబర్ 22వ తేదీన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన జయలలిత మళ్లీ తన నివాసమైన పొయస్ గార్డెన్ కు వెళ్లలేదు. జయ ఆసుపత్రిలో చేరినదగ్గర నుండి ఆమె అనారోగ్యంపై పూర్తిస్ధాయిలో గోప్యత పాటించారు. దాంతో జయకు ఏమి జరుగుతోందో ఎవరికీ అర్ధం కాలేదు. కొద్ది రోజుల తర్వాత జయ కోలుకుంటున్నారని, ఆమె ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆమె నివాసానికి వెళ్లవచ్చని ఆసుసత్రి యాజమాన్యం ప్రకటించింది. అయితే ఆదివారం రాత్రి గుండెపోటు రావటంతో పరిస్ధితి విషమించింది.
జయలలిత సినిమాల్లో ఉన్నా,రాజకీయాల్లోవున్నా సంచలనమే. సినిమారంగ ప్రవేశం ఇష్టంలేకుండానే చేయాల్సి వచ్చింది. అదేవిధంగా రాజకీయాల్లోకి కూడా అయిష్టంగానే ప్రవేశించారు. అయితే, ఒకసారి ప్రవేశించిన తర్వాత సినిమా రంగంలోను, రాజకీయరంగలో కూడా తనదైన ముద్ర వేసారు. సినిమాల్లో ఉన్నపుడు, రాజకీయాల్లో ఉన్నపుడు కూడా కోట్లాదిమంది అభిమానుల హ్రుదయాలను కొల్లగొట్టారు.
మాజీ ముఖ్యమంత్రి ఎంజిఆర్ బలవంతంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన జయ మొదటిసారిగా 1991లో ముఖ్యమంత్రయ్యారు. ఆ తర్వాత 2001, మే నెలలో సిఎంగా బాధ్యతలు స్వీకరించినా తనపై వచ్చిన అవినీతి ఆరోపణలతో జైలుకు వెళ్లారు. దాంతో అప్పుడు కూడా తనకు నమ్మకస్తుడైన పన్నీర్ శెల్వంనే ఆపధర్మ ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు.
ఆ తర్వాత 2002లో జైలు నుండి విడుదలైన 2006 వరకూ సిఎంగా కొనసాగారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైనా మళ్లీ 2011లో ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. ఆ తర్వాత 2016 మే నెలలో జరిగిన ఎన్నికల్లో కూడా రెండోపర్యాయం గెలిచి రికార్డు సృష్టించారు. అయితే, గెలిచిన కొద్ది రోజుల్లోనే మళ్ళీ అవినీతి ఆరోపణలపై పదవిని వదిలిపెట్టి కొన్ని రోజులు బెంగుళూరులోని జైల్లో గడిపారు.
ఆ తర్వాత జైలు నుండి విడుదలైన జయలలిత కొద్ది రోజులు బాగానే ఉన్నారు. అయితే, ఆమె అనారోగ్య పరిస్థితిపై అప్పటి నుండి వదంతులు వినబడుతూనే ఉన్నాయి. చివరకు సెప్టెంబర్ 22వ తేదీన తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన జయలలిత సోమవారం తుదిశ్వాస విడిచారు.
