అమ్మ పోయి చిన్నమ్మ ముందుకొస్తూ ఉండటంతో   ఎందుకయినా మంచిదని జయలలిత క్యాలెండర్ల ముద్రణ అపేస్తున్నారట.

కొత్త మిళ రాజకీయం పుడుతోందక్కడ.

అమ్మ సంతాపం దినాలు ముగియలేదు. ఇంకా అమ్మ చావు తో షాక్ తిన్న చనిపోయిన అభిమానుల వార్తలు ఇంకా వస్తూ నే ఉన్నాయి. అయితే, కొంత మంది మినిస్టర్లు, ఎమ్మెల్యేలు జయలలిత జ్ఞాపకాలు చెరిపేసే పనిలోపడిపోయారు. జయలలిత పెద్ద చిత్రంతో ముద్రించాలనుకున్న 2017 క్యాలెండర్ ముద్రణను అపుడే క్యాన్సిల్ చేశారు. 

క్యాలెండర్ ముద్రించే పనిని నిలిపివేయాలని చాలా మంది శాసన సభ్యులు, పార్టీ నేతలు తమకు డిసెంబర్ ఆరో తేదీనుంచే పోన్ చేస్తున్నట్లు ఒక ముద్రాపకుడు తన వివరాలు వెల్లడించవద్దని కోరుతూ చెప్పాడు.

తమిళనాడులో దిన క్యాలెండర్లు ఇంకా చాలా ఫేమస్. ఇవి ఆంధ్రలోఎపుడో మాయం మయ్యాయి. ఈ క్యాలెండర్ లో 365 పేజీలుంటాయి.రోజొక పేజీ చింపేస్తూ ఉండాలి. జయలలిత పేరుతో పార్టీ, నాయకులు ఈ క్యాలెండర్లను భారీ సంఖ్యలో ముద్రించి పంచడం అలవాటు.

అయితే, అమ్మ పోయి చిన్నమ్మ రావడంతో ఇపుడు ఎందుకయినా మంచిదని జయలలిత క్యాలెండర్ల ముద్రణ అపేస్తున్నారట.

ఒక సమాచారం ప్రకారం పార్టీ 25,000 డెయిలీ పేజ్ క్యాలెండర్ ముద్రించేందుకు అర్డర్ ఇచ్చారు. దీని మీద జయలలిత ఆసుపత్రిలో ఉన్నప్పటి బొమ్మ ప్రముఖంగా కనిపించేలా ముద్రించాలి. జయలలిత పోటో పాటు, వాటిని ముద్రణకు ఇచ్చిన పార్టీ నేత బొమ్మ చిన్నది గా ఉండేలా క్యాలెండర్ ముద్రణ పూర్తయింది. లామినేషన్ కూడా అవుతూ ఉంది. ఇంక క్యాలెండర్ బోర్డు మీద దీనిని అతికించి క్యాలెండ ర్ పుస్తకాన్ని బిగించడమే మిగిలి ఉంది.

‘డిసెంబర్ 5 ముఖ్యమంత్రి చనిపోయారు. ఆ మరసటి రోజు నుంచి ముద్రణ ఆపేయాలని కాల్స్ వస్తున్నాయి. క్యాలెండర్ లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంది. అందువల్ల ముద్రణ ఆపేయాలి అంటున్నారు,’ అని ఈ ముద్రాపకుడు చెప్పారు. కొన్ని జిల్లాలో పూర్తిగా ముద్రణ అపేసినట్లు సమాచారం అందింది. కొంతమంది ప్రెస్ వారికి నష్ట పరిహారం కూడా ఇస్తామంటున్నారు. మార్పులంటే ఏముంది చిన్నమ్మ ఫోటో పెట్టడమే.

 ఈ మార్పుకు కారణమేమిటంటే, జయలలిత స్థానాన్ని శశికళ అక్రమిస్తూ ఉంది. అందువల్ల అమ్మ బొమ్మతో క్యాలెండర్ వస్తే చిన్నమ్మకు చిన్నబుచ్చుకుంటే ఎలా???