అమ్మ లేక విలవిల్లాడుతున్న ఎఐఎడిఎంకె

అమ్మ లేక విలవిల్లాడుతున్న ఎఐఎడిఎంకె

‘అమ్మ’ జయలలిత చనిపోయి అపుడే  ఏడాది అయిపోయింది. తమిళనాడు రాజకీయాలను ఆమె ఎంతశాసించారో ఆమె లేని లోటును చూస్తే అర్థమవుతుంది.  తమినాడు రాజకీయాలను ఆమె లేని లోటూ బాగా పీడిస్తూ ఉంది.   తమిళనాడు రాజకీయాలలోనే కాదు,  ఎఐడిఎంకె పార్టీలో కూడా జయలలిత లేని వెలితి పెద్దగా కనబడుతూ ఉంది.  ఈ వెలితి చాలా ఆసక్తి కరమయిన పరిణామాలకు దారితీస్తూ ఉంది. ఆమె ఎఐఎడిఎంకె పార్టీకి తెచ్చిన తమిళ  వన్నె తరిగిపోతూ ఉంది. పార్టీ లో ఏ ఒక్కరూ ఆమె నాయకత్వాన్ని పూరించే స్థితి కాదకదా ఆమె పార్టీని  విలక్షణమయన తమిళ పార్టీగా బతకనిచ్చే శక్తి కూడా ఎవరికీ లేదు. పార్టీలో అవకాశం వాదం అక్టోపస్ లాగా తయారయింది. ఎపుడూ ఈ జాతీయ పార్టీకి దాసోహం అనని జయ విధానం పోయింది. కేంద్రం లో ఎపుడైనా ఒక జాతీయ పార్టీ ని  సమర్థించినా, ఆ పార్టీని తమిళనాడు రాజకీయాలలో తలదూర్చకుండా ఆమె జాగ్రత్తపడ్డారు. ఇపుడు తమ పదవులు కాపాడుకునేందుకు ఎఐడిఎంకె నేతలంతా బిజెపితో చేతులకలిపారు. బిజెపి ఈ అసరాతో తమిళనాట ప్రవేశించాలని చూస్తూ ఉంది

 

 ‘మాకేమీ ప్రమాదం లేదు. మా ప్రభుత్వానికి ఢోకా లేదు. కేంద్రంలో బిజెపి మాకు అండ,’ అని ఎఐడిఎంకె నాయకులు బాహాటంగా చెబుతున్నారు. ఇలాకేంద్రం అండన బతకడం తమిళ రాజకీయాలలో ఎపుడూ లేదు. ఇది ఆమె మృతి తీసుకు వచ్చిన ఒక విపత్తు అని చెప్పక తప్పదు. ఇపుడేం జరుగుతున్నదో చూడండి.

* తమిలనాట పేదవారికి ఆమె అమ్మగా గుర్తుండిపోయారు. వీరంతా ఆమె మొదటి వర్ధంతిని జరుపుకుంటూ ఉంటే..

*మరొక వైపు ఆమె రాజకీయ వారసత్వం కోసం, ఇంకొక ఆస్తుల కోసం గొడవ జరుగుతూ ఉంది.

* ఆమె వారసత్వం తనదే నని దీప జయరామన్ గొడవచేస్తూ ఉంటే, నేను జయలలిత కూతుర్ని అంటూ మరొక అమ్మాయి రంగ ప్రవేశం చేసింది.

*. ఇక రాజకీయాలలో ఎఐడిఎంకె పట్టు కోల్పోయింది. కేంద్రంలోబిజెపి అండ పరోక్షంగా ఉంది కాబట్టి బతికి బట్టకడుతూ ఉంది.  ఎఐడిఎంకె చీలికలు పేలికలు అయ్యేందుకు సిద్ధంగా ఉంది.

*పైకి పన్నీర్ సెల్వం, పళిన స్వామి వర్గాలు రాజీపడిన,అదేదో పబ్బం గడుపుకునేందుకే తప్ప పార్టీని బతికించేందుకు కాదు.

 

 

*మరొక వైపు, జైలులో ఉన్న శశికళ మేనల్లుడు పార్టీ మీదపట్టుకోసం పడరాని పాట్లుపడుతున్నారు. ఈ పోరాటంలో ఆయనకు దెబ్బమీద దెబ్బ పడుతూ ఉంది.

* పార్టీ గుర్తు ప్రత్యర్థులకు వెళ్లిపోయింది. ఎన్నికల కమిషన్ పార్టీ గుర్తు పళనిస్వామి, పన్నీర్ సెల్వాలదే నని చెప్పింది.

*ఈ గొడవల్లో తమిళనాడులో పాదం మోపేందుకు బిజెపి విశ్వప్రయత్నాలు చేస్తున్నది. ఎఐడిఎంకె ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులను తన వైపు తిప్పకోగలింది.

*తమిళ రాజకీయాలలో జయలలిత వంటి మహాశక్తి లేని లోటును పూరించేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు.

*సినీనటులు రజనీకాంత్ ఒక వైపు, కమల్ హాసన్ మరొక వైపు రాజకీయాల్లోకి రానున్నారు.

*మరొక విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా బిజెపి వ్యతిరేక తమిళరాజకీయాలు రాజేస్తున్నారు

* జయలలిత లేకపోవడం అనేక పెనుమార్పులు వచ్చేందుకు బాట వేసింది. తమిళనాట బిజెపి  కాలూనగలదా, తమిళ ప్రజలు విశిష్టతను కాపాడుకుంటారా...వేచిచూడాలి.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos