ఊహించడమే కష్టం: కుమారస్వామికి జవదేకర్ ఘాటు రిప్లై

ఊహించడమే కష్టం: కుమారస్వామికి జవదేకర్ ఘాటు రిప్లై

బెంగళూరు: ఒక్కో ఎమ్మెల్యేలకు వంద కోట్ల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేయాలని జెడిఎస్ నేత కుమారస్వామి చేసిన ఆరోపణపై కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తీవ్రంగా ప్రతిస్పందించారు. వంద కోట్ల రూపాయలు అంటే ఊహించుకోవడమే కష్టంగా ఉందని అన్నారు.

నోట్ల రాజకీయాలు ఎవరు చేస్తున్నారో కర్ణాటకలో అందరికీ తెలుసునని ఆయన బుధవారం మీడియాతో అన్నారు. వంద కోట్ల నగదు అంటే భారీ మొత్తమని, అయినా నగదుతో నేతలను మభ్యపెట్టడం కాంగ్రెసు, జెడిఎస్ లకే ఎక్కువగా తెలుసునని అన్నారు. 

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తాము గవర్నర్ వాజుభాయ్ వాలాకు విజ్ఞప్తి చేశామని, బిజెపి ఎన్నిటికి కూడా నియమాలను ఉల్లంఘించదని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయగలమని తాము ఇప్పటికీ విశ్విసిస్తున్నట్లు తెలిపారు.

ప్రత్యర్థి కూటమి తమ పార్టీపై బురదచల్లే ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు. వ్యాపారం చేసినట్లుగా నేతలను కొనడం కాంగ్రెసుకు ఎక్కువ తెలుసునని, జెడిఎస్ తో పొత్తుపై కాంగ్రెసు ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారని ఆయన అన్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos