ఇప్పటికైనా పార్టీ నిర్మాణంపై దృష్టి పెడుతున్నట్లు చెప్పటం పవన్ అభిమానులకు సంతోషం కలిగించే వార్తే.

వచ్చే ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జనసేన పోటీ చేస్తుందని పవన్ కల్యాన్ చెప్పారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీడియాతో పవన్ మాట్లాడుతూ, వచ్చే జూన్ నుండి పార్టీ నిర్మాణంపై దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. పార్టీ ప్రకటించిన మూడేళ్ళ తర్వాత పార్టీ నిర్మాణంపై పవన్ దృష్టి పెడతానని చెప్పటం గమనార్హం. వచ్చే మార్చి కల్లా ఆ పని పూర్తి చేస్తారట. పార్టీలతో పొత్తుల విషయం పూర్తిస్ధాయిలో పార్టీ నిర్మాణం జరిగిన తర్వాత ఆలోచిస్తానన్నారు.

2014 నాటి వాతావరణం అయితే ఇపుడు రాష్ట్రంలో లేదన్నారు. మంచి యువనాయకత్వం కోసం ఇంకా ఎదురు చూస్తున్నారట. అటువంటి యువత ఎక్కడున్నా పట్టుకొస్తానని చెప్పటం విశేషం. యూపిలో అఖిలేష్ ఓటమికి కుటుంబ కలహాలు కూడా ఒకటని అభిప్రాయపడ్డారు. ఏదేమైనా, ఇప్పటికైనా పార్టీ నిర్మాణంపై దృష్టి పెడుతున్నట్లు చెప్పటం పవన్ అభిమానులకు సంతోషం కలిగించే వార్తే. కాకపోతే అదేదో త్వరగా చేస్తే బాగుంటుందని అభిమానులు అంటున్నారు.