చిక్కుల్లో జనసేన హెడ్ క్వార్ట ర్స్ ప్లాన్

చిక్కుల్లో జనసేన హెడ్ క్వార్ట ర్స్ ప్లాన్

ఇది రాజధాని అమరావతి సమీపంలోని మంగళగిరి మండలం చిన్నకాకాని   వద్ద  జనసేన పార్టీ  కేంద్ర కార్యాలయం కోసం ఎంపిక చేసిన  స్థలం వివాాదంలో పడింది. దీనిని వదులుకోవాలని, పార్టీ నిర్మాణం కబ్జా భూమిలో  చేయవద్దని మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తలు  పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు నేడు విజ్ఞప్తి చేశారు.

 


ఎంపిక చేసిన స్థలం వివాదం హైకోర్టులో ఉందని, అది తమకే చెందుతుందని ముస్లిం ఐక్యవేదిక నేతలు చెబుతున్నారు.
ఆ స్థలం మైనారిటీకి చెందిన వ్యక్తులదని ముస్లిం ఐక్య వేదిక వారి వాదన. 1958 నుంచి ఈ స్థలంపై యార్లగడ్డ సుబ్బారావు, ముగ్ధం మోహిద్దున్ - జక్రియా ల మధ్య వివాదం నడుస్తోందని వారు చెబుతున్నారు. 1998లో గుంటూరు కోర్టులో యార్లగడ్డ సుబ్బారావు చుక్కెదురయింది.

అదే సంవత్సరం హైకోర్టులో పిటిషన్ వేశారు ముస్లిం వర్గీయులు. ల్యాండ్ పై హైకోర్టులో స్టే  కూడా తీసుకొచ్చారు. నేటికి ఈ స్టే కొనసాగుతూ ఉంది.  ఇప్పటికే జనసేనానికి విషయం తెలిజేశామని చెబుతున్నారు. ఆయన తమకు విజ్ఞప్తిని తోసిపుచ్చితే   జనసేన అధ్యక్షుడు పవన్ పై పోలీసులకు పిర్యాదు చేసి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామంటున్నారు.  మైనారిటీ సంస్థ  వారసులు ఈ రోజు మీడియా ముందుకు వచ్చి వివాదం గురించి వివరించారు. ఇక్కడ ఆఫీసు నిర్మిస్తే కబ్జా మచ్చఅంటుకుంటుందని వారు హెచ్చరిస్తున్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos