జమ్మూలో ఘోర రోడ్డు ప్రమాదం 100 అడుగుల లోయలో పడ్డ బస్సు
జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఓ మినీ బస్సు 100 అడుగుల లోయలో పడింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా.. 15 మంది గాయపడ్డారు.
ఉదంపూర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో కరోవా జిల్లాలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. రామ్‌నగర్ నుంచి ఉదయంపూర్‌కు ప్రయాణికులతో వెళుతుతుండగా వాహనాన్ని నియంత్రించడంలో డ్రైవర్ విఫలం కావడంతో బస్సు లోయలో పడిపోయింది. ఘటనా స్థలిలో నలుగురు చనిపోగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతిచెందారు. గాయపడిన 15 మందిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.
