అమరావతికి ఒక చిన్న గుడ్ న్యూస్

First Published 2, Jan 2018, 5:12 PM IST
jaitley  says AP Amaravati loan request is being processed by world bank
Highlights

ప్రపంచబ్యాంకు పరిశీలనలో అమరావతి లోన్

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో కీలక ప్రకటన చేశారు.

 అమరావతి నిర్మాణానికి రూ. 3,324 కోట్ల రుణం ఇచ్చే అంశాన్ని ప్రపంచ బ్యాంకు పరిశీలిస్తోందని వెల్లడించారు.

 అమరావతి నిర్మాణానికి నిధుల కేటాయింపుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రశ్నించినపుడు ఆర్థికమంత్రి ఈ సమాధానమిచ్చారు.

దీనిపై స్పందించిన అరుణ్ జైట్లీ... రాజధాని నిర్మాణానికి రూ. 3,324 కోట్లు కావాలని ఏపీ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకును కోరిందని చెప్పారు. 

ఈ అంశాన్ని వరల్డ్ బ్యాంక్ పరిశీలిస్తోందని... సంప్రదింపులు పూర్తి అయిన వెంటనే రుణం మంజూరవుతుందని తెలిపారు. 

అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు నిర్మాణానికి కేంద్రం ఇప్పటికే రూ. 1500 కోట్లు ఇచ్చిందని చెప్పారు

loader