ఓవర్ సీస్ రైట్స్ విషయం హాట్ టాపిక్ గా మారింది ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
జూనియర్ ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘జై లవ కుశ’. ‘టెంపర్’, ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్’ చిత్రాలతో తారక్ హ్యట్రిక్ కొట్టారు. ఈ తరువాత వస్తున్న చిత్రం ఇదే కావడంతో.. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రంలోని ‘జై’ క్యారక్టర్ కి చెందిన టీజర్ ని ఇటీవల విడుదల చేశారు. అందులో ఎన్టీఆర్ కనిపించిన తీరు.. డైలాగులు పలికిన విధానానికి అభిమానులు ఫిదా అయ్యారు.
కాగా.. ఇప్పుడు ఆ చిత్ర ఓవర్ సీస్ రైట్స్ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్ర ఓవర్సీస్ రైట్స్ ని ఏకంగా రూ.8.5కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ విషయంపై అధికారికంగా ప్రకటన రాకపోయినప్పటికీ.. ఇది నిజమేనని ఫిల్మ్ నగర్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాలో రాశీఖన్నా, నివేదా థామస్ లు ఎన్టీఆర్ సరసన నటిస్తున్నారు. కేఎస్ రవీంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. ఎన్టీఆర్ సోదరుడు, హీరో.. కల్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
