Asianet News TeluguAsianet News Telugu

'మధ్యంతర' వాసన వస్తోందంటున్న జగన్

రోజులు కలిసొస్తే ఒక ఏడాదిలో ‘మన’ ప్రభుత్వం వస్తుందని. మధ్యంతర ఎన్నికల గురించి మొదట నుంచి  రాష్ట్రంలో జ్యోతిషం చెబుతున్నది పండితులుకాదు, జగనే.

Jagan smells modi plan for midterm polls at centre

రెండు మూడు వారాలుగా ఒక వాదన  ప్రచారం లో ఉంది.

 

నోట్ల రద్దు తర్వాత కొన్ని కోట్ల మంది ప్రజలు చిల్లర లేక చిక్కిపోతున్నపుడు, బ్యాంకు నుంచి డబ్బు తీసుకునేందుకు క్యూలు పెరుగుతున్నపుడు, అర్ధరాత్రి దాకా ఎటిఎం దగ్గిర రెండువేలకోసం అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నపుడు, ప్రతిపక్ష పార్టీలు ఆక్రోష్ దివస్ లు, బంద్ లు పాటిస్తున్నపుడు  ప్రధాని మోదీ మాత్రం చెక్కుచెదరలేదు.

 

దానికితోడు  ప్రజలంతా నా వెనకే ఉన్నారన్నారు. క్యూలలో ,బ్యాంకులలో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్ననపుడు, ప్రజలంతా నోట్ల రద్దును స్వాగతిస్తున్నారు.  తనకు మధ్దతునిస్తున్నారని అన్నారు.

 

  ఈ నేపథ్యంలో నుంచి పుట్టుకొచ్చిందీవాదన. అదేమిటంటే....

 

 నోట్ల కొరత ఒకటి రెండు నెలల్లో కుదట పడవచ్చు. స్వైపింగ్ మిషన్లొస్తాయి. కొత్త నోట్లొస్తాయి.దీనితో ప్రజలు హమ్మయ్య అని వూపిరి పీల్చుకోవచ్చు. ఈ లోపు ఎంత నల్ల ధనం దొరికిందో లెక్కలు ప్రచారంలోకి వస్తాయి. అపుడు ప్రజలంతా నావైపు ఉన్నారని రుజువు చేసేందుకు ప్రధాని మోదీ  లోక్ సభను రద్దు చేసి, మధ్యంతర ఎన్నికలకు వెళ్లవచ్చ.

 

పాపాలు కడిగేసే శక్తి ఎన్నికలకు ఉన్నంత ఏ పవిత్ర నదీజలానికి లేదు. అందువల్ల మోదీ తన నోట్ల మరకలు అంటిన తన చేతుల్ని మధ్యంతర ఎన్నికలతో కడిగేసుకునే ప్రయత్నం చేయవచ్చు. గెలిస్తే, తనకు జనామోదం ఉందని ప్రకటించుకోవచ్చు.

ఈ వాదనకు ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బలం చేకూరుస్తున్నారు.మధ్యంతర ఎన్నికల అవకాశం ఉందని నిన్న తన పార్టీ నేతలకు జగన్ వివరించి చెప్పారు.

 

జగన్ ఎప్పటినుంచో ఎన్నికల కోసం ఎగిరి గంతేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన కాలికి బలపం కట్టుకుని రకరకాల యాత్రల పేరుతో, ప్రత్యేక హోదా పేరుతో రాష్ట్రాన్ని ఈ పాటికి ఒక అర డజన్ సార్లు చక్కర్లు కొట్టి ఉంటాడు. కొన్ని వందల సమావేశాలలో మాట్లాడి వుంటాడు. అక్కడంతా ఆయన చెపిందొక్కటే. రోజులు కలిసొస్తే ఒక ఏడాదిలో ‘మన’ ప్రభుత్వం వస్తుందని. మధ్యంతర ఎన్నికల గురించి మొదట రాష్ట్రంలో జోతిషం చెప్పింది, పండితులుకాదు, జగనే.

 

ఆయనిపుడు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఎమ్మెల్యేలకు, ఎంపిలకు... మధ్యంతర ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మోదీ మరొక ప్రయోగానికి పూనుకుంటున్నారనిపెద్దనోట్ల రద్దు నిర్ణయం  వెనక  అదే ఆలోచన ఇదే కావచ్చుని జగన్ గడపగడపకు వైఎస్ఆర్ కార్యక్రమం సమీక్షలో  చెప్పారు.

 

 మోదీ ప్రయోగం లో భాగంగా  ఉత్తర ప్రదేశ్లో జరగాల్సిన ఎన్నికలు వాయిదా వేసిన ఆశ్యర్యం పోనవసరం లేదని,వాయిదా వేసి దేశ వ్యాపితంగా  ఒకే సారి ఎన్నికల వెళ్లే అవకాశం లేకపోలేదని కూడా ఆయన అన్నారు. అందదవల్ల అందరూ  సిద్ధం కండి అనిపిలుపు నిచ్చారు.

 

ప్లస్,  ఎన్నికల ప్రిపరేషన్ మొదలుపెట్టి నెలలో 16 రోజులు కచ్చితంగా వూర్లలో తిరగాల్సిందే. ప్రజల్లో ఉండాల్సిందే. పనిచేయాల్సిందే అన్నారు

Follow Us:
Download App:
  • android
  • ios