బస్సు ప్రమాదానికి దివాకర్ ట్రావెల్స్ ను బాధ్యులను చేయకపోతే ప్రమాదాలిలాగే కొనసాగుతాయి
కృష్ణా జిల్లాలో జరిగిన ప్రమాదానికి పూర్తి బాధ్యత యాజమాన్యానిదే నని, యాజమాన్యం చేత ఒక్కొక్కరికి కనీసం రు. 20 లక్షలు పరిహారం మృతుల కుటుంబాలకు అందించాలని ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ రోజు తెల్లవారు జామున జరిగిన దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలోగాయపడిన వారిని పరామర్శించేందుకు జగన్ మోహన్ రెడ్డి నందిగామ ప్రభుత్వాసుపత్రికి వచ్చారు.

అయితే, తెలుగుదేశంకార్యకర్తలు ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆయనను విలేకరులతో మాట్లడనీయలేదు. అలాగే ఆసుపత్రిలోకి కూడా వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనితో కొంత ఉద్రికత్త నెలకొనింది. పార్టీ సినియర్ నాయకుడు పార్థ సారధి ఒక దశలో పోలీసులో వాగ్వాదానికి దిగాల్సి వచ్చింది.
ఈ ప్రమాదంలో యాజమాన్యాన్ని బాధ్యులను చేయకపోతే, భవిష్యత్తులో ప్ర మాదాలను, ‘ఇంతే కదా’ అని బస్సు యాజమాన్యాలు తెలికగా తీసుకునే వీలుందని, అపుడు ప్రయాణికులకు భద్రతే లేకుండా పోతుందని ఆయన చెప్పారు.
గాయపడిన వారికి రు. 10 లక్షలు చెల్లించాలని కూడా జగన్ డిమాండ్ చేశారు.
డ్రైవర్ తో సహా చనిపోయిన వారి మీద ఇంకా పోస్టు మార్టం చేయకపోవడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన అన్నమాటలివి :
బస్సు రెండో డ్రయివర్ ఏమయ్యాడు. భవనేశ్వర్ నుంచి బస్సు హైదరాబాద్ కు వస్తూంది. ఇది కాంట్రాక్ట్ క్యారియరా, స్టేజ్ క్యారియరా? బస్సు రెండో డ్రయివర్ ఎక్కడ అని అడిగితే రెండో వాడు, వెళ్లిపోయాడని చెబుతున్నారు. ఆ డ్రయివర్ ఎలా వెళ్తాడు, ఆయనకు లైసెన్స్ లేదా, మరయితే,ఎందుకు ఇక్క డ లేడు. ఆయనను ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదు, ఇందులో కుట్ర జరుగుతూఉంది. రెండో డ్రయివర్ ను పరారి చేయించి, అతనిస్థానంలో లైసెన్స్ ఉన్న వ్యక్తిని చూపించి తాగ లేదని చెప్పే ప్రయత్నాలు జరగుతున్నాయని నా అనుమానం.
ఎంపి ఒక పద్ధతిప్రకారం బస్సు యాజమాన్యాన్ని కాపాడే ప్రయత్నం జరగుతుూ ఉంది.
తెలుగుదేశం మద్దతుదారుల బస్సులే ప్రమాదానికి గురవుతున్నాయి. కేశినేని ట్రావెల్స్, దివాకర్ ట్రావెల్స్,ఎవరివి? ఒకే లైసెన్స్ తో రెండు మూడు బస్సులు నడుపుతున్నారు. కాంట్రాక్టు క్యారియర్ అయినా స్టేజి క్యారియర్ గా నడుపుతున్నారు. ఈ ప్రమాదంలో బస్సు కు ఎదురుగా బస్సు వచ్చే అవకాశం లేదు.దాదాపు 150కి.మి వేగం వస్తూఉందని నా అనుమానం. అపుడు కల్వర్ట్ గుద్ది, గాల్లోకి లేచి 150 అడుగుల దూరంలో పడింది.అంటే కనీసం `120 నుంచి 150 కిమీ వేగంతో ప్రయాణం చేసి ఉండాలి.
మరిడ్రయివర్ తాగున్నాడా, ఈ విషయం గురించి ప్రశ్నిస్తే డాక్టర్ పోస్టు మార్టం చేయలేదని చెప్పారు.
చంద్రన్నబీమా అని రెండు లక్షలు, అయిదు లక్షలుకాదు పరిహారం కాదు, బస్సు యాజమాన్యం నుంచి కనీసం 20 లక్షలు తక్కువ లేకుండా వసూలు చేయాలి.
అపుడే ఇలాంటి ప్రమాదాలు అగుతాయి, లేకపోతే, ఈ ప్రమాదాలు కొనసాగుతాయి. కాబట్టి మానవత్వం ప్రదర్శించి యాజమాన్యాన్ని బాధ్యలను చేయాలి.
***
అంతకు ముందు జగన్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.
జగన్ సందర్శనకు వచ్చినపుడు పత్రికల వారి మీద కూడా పోలీసులు ఆంక్షులు విధించారు. పోస్టు మార్టం లేకుండానే మృత దే హాలను పంపించేందుకు అంబులెన్స్ లోకి ఎక్కించారు. అపుడు అంబులెన్స్ ను వైసిపి కార్యకర్తులు అడ్డుకోవలసి వచ్చింది.
