మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జడ్చర్ల పట్టణంలోని అక్షర స్కూల్ విద్యార్థుల పైకి కారు దూసుకెళ్లడంతో విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థులంతా ప్రార్థన చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థిని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోగా, మరో నలుగురు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు.

స్కూల్ ప్రిన్సిపల్ మురళి కారును పార్క్ చేసే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగింది. కారు విద్యార్థులను ఢీ కొట్టి డ్రైనేజి కాలువ అడ్డురావడంతో ఆగిందని, లేదంటే ఇంకా చాలామంది విద్యార్థులు ప్రమాదానికి గురయ్యేవారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన విద్యార్థి ఎస్వీఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

 

వీడియో