మద్యం తాగే అమ్మాయిలను చూస్తే భయమేస్తోందంటున్నారు గోవా సీఎం మనోహర్ పారికర్. ఆయన శుక్రవారం స్టేట్ యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ‘అమ్మాయిలు కూడా బీర్లు తాగడం ప్రారంభించారు. అది కూడా పరిమితికి మించిపోతోంది. వీళ్లను చూస్తే భయమేస్తోంది’ అని అన్నారు. అంతేకాదు.. తాను అందరు అమ్మాయిల గురించి ఇలా మాట్లాడటం లేదన్నారు. ప్రస్తుత కాలంలో మద్యం తాగే అమ్మాయిలు రోజు రోజుకీ పెరిగిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు .

 అనంతరం డ్రగ్స్ మాఫియా గురించి మాట్లాడుతూ.. గోవాలో డ్రగ్స్‌ నెట్‌వర్క్‌ ను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని, రాష్ట్రంలో పూర్తిగా డ్రగ్స్‌ లేకుండా చేసే వరకు మాఫియాపై దాడులు కొనసాగుతాయని పారికర్‌ వెల్లడించారు. మాదక ద్రవ్యాల వినియోగం కళాశాలల్లో విపరీతంగా ఉందనే వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు. అయితే.. అసలు కాలేజీలో డ్రగ్స్ అమ్మకాలు జరగడం లేదని తాను అనడం లేదని ఆయన అన్నారు.