Asianet News TeluguAsianet News Telugu

ఈ ముస్లిం దంప‌తుల‌ను శ‌భాష్ అన్న కేటీఆర్‌

  • మట్టి విగ్రహాలనే ప్రతిష్టించాలని ప్రచారం,
  • భర్త వినాయకుడిలా వేశం, భార్య రిక్షను తోస్తుంది.
  •  కాలుష్యం తగ్గించి భవిషత్తు తరాలను కాపాడాలని ప్రచారం.
IT minister ktr wishesh to clay ganesh suppoters

మ‌హ‌బూబబాద్ జిల్లాకు చెందిన మ‌హ్మ‌ద్ సుభానీ, స‌లీమాలు వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా మ‌ట్టి విగ్ర‌హాల‌నే ప్ర‌తిష్టించాల‌ని ప్ర‌చారం చేస్తున్నారు. భ‌ర్త గ‌ణేశుడిలా వేషం వేసి, రిక్షా మీద కూర్చుంటే భార్య రిక్షాన్ని తోసుకుంటు మ‌ట్టి గ‌ణేషుడిని ప్ర‌తిష్టించాల‌ని ప్ర‌చారం చేస్తున్నారు. ఆ ముస్లిం దంప‌తులు చేస్తున్న ప్ర‌చారం చాలా బాగుంద‌ని సంతోషం వ్య‌క్తం చేశారు తెలంగాణ ఐటీ మినిష్ట‌ర్ కల్వకుంట్ల తార‌క‌రామారావు. 

2013 సంవ‌త్స‌రం నుండి ప్ర‌తి సంవ‌త్స‌రం వినాయ‌చ‌వితి పండ‌గ సందర్భంగా వీరు ప్ర‌చారం చేస్తారు. ప్లాస్ట‌ర్ ఆఫ్ పారిస్ వినాయ‌కుడి విగ్ర‌హాల‌ను కాకుండా మ‌ట్టి విగ్ర‌హాల‌ను ప్ర‌తిష్టించాలి అని, భ‌విష‌త్తు త‌రాల‌ను కాపాడాల‌ని, సంతోషం అంటే మ‌నతో పాటు మ‌న త‌రువాతి త‌రాలు కూడా అంటు స‌లీమా, సుభానీలు ప్ర‌చారం చేస్తున్నారు. భ‌ర్త సుభానీ అచ్చ వినాయకుడి రూపంలో ధోతి ధ‌రించి, చొక్కా లేకుండా, శ‌రీరం మొత్తం మ‌ట్టి రంగు రుద్దుకుని, మ‌ట్టి వినాయ‌కుడి ఆకారంలో చేసిన త‌ల‌ను ధ‌రించి రిక్షా మీద గ‌ణ‌ప‌తి లాగా కూర్చుంటాడు. ఆ రిక్షాను స‌లీమా వీధుల గుండా తోసుకుంటూ వెళ్తూ మ‌ట్టి వినాయ‌కుడి ప్రాముఖ్య‌త‌ను వివ‌రిస్తుంటుంది. గ‌ల్లీ గల్లీకి తిరిగి భార్య భ‌ర్త‌లు వినూత్న రీతిలో చేస్తున్న‌ ప్ర‌చారం గ‌త మూడు సంవ‌త్స‌రాల నుండి అక్క‌డ బాగా పాపుల‌ర్ అయ్యారు. 

 ప్ర‌తిష్టించాల‌ని ముస్లిం దంప‌తులు చేస్తున్న కృషి మంత్రి కేటీఆర్ కు చేరింది. ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ద్వారా మెచ్చుకున్నారు. 

 

మరిన్ని తాజా విశేషాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Follow Us:
Download App:
  • android
  • ios