వచ్చేనెలలో ఇస్రో 83 శటిలైట్లను నింగిలో ప్రవేశపెడుతూ ఉంది. ఇదొక ప్రపంచ రికార్డు
మన ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ అర్గనైజేషన్ ) ప్రపంచంలో నెంబర్ వన్ అయింది. అనితరసాధ్యమయిన ఫీట్లు చేస్తూ ఎవరూ వూహించనంత ఎత్తుకు వేగంగా దూసుకుపోతుంది.
ఇపుడు శటిలైట్సను ఆకాశంలోకి ఎగరేయడం మంటే మన ఇస్రో శాస్త్రవేత్తలకు బంతులాటే. ఒకటి అరా వైఫల్యాలున్నా, ఇస్రో పనితీరు గ్రాఫ్ అలా పై పైకి వెళ్లిపోతూ ఉంది. అందుకే ప్రపంచంలో ఏ దేశమయిన ఉపగ్రహాలను అకాశంలో కి పంపాలను కుంటే, ఇస్రో వైపు చూస్తున్నారు.
2017 జనవరి ఇస్రో చరిత్రలో మరొక మైలు రాయి కానుంది.
ఈ నెలలో 83 శటిలైట్లను కక్ష్య ల్లోకి ప్రవేశపెడుతూ ఉంది. ఇదొక ప్రపంచ రికార్డు.
ఇందులో 80 శటిలైట్లు ఇజ్రేల్, కజఖ్ స్తాన్, నెదర్లాండ్స్, స్విజర్లాండ్, అమెరికా దేశాలవి. ఒక్కక్క ఉపగ్రహం బరువు 500 కిలోలు. ఇస్రో వాణిజ్య విభాగం అంట్రిక్స్ ఈదేశాలతో కుదరుర్చకున్న వాణిజ్య ఒప్పందం ప్రకారం ఈ శటిలైట్లను నింగిలోకి పంపిస్తున్నారు.
ఇంత పెద్ద ఎత్తున శటి లైట్ ప్రయోగాలకోసం అమెరికా తో సహా అనేక ప్రపంచ దేశాలు ఇస్రో నుఅశ్రయించడం, ఇస్రో కూడా వీటి ప్రయోగానికి సాహసించడం ... భారత అంతరిక్ష పరిశోధన చరిత్రలో ఒక మరుపు రానిఘట్టమవుతున్నది.
జనవరిలో ప్రయోగిస్తున్న వాటిలో 80 విదేశీ ఉపగ్రహాలయితే, మిగతా మూడు భారత్ వి. వాటి పేర్లు కార్టోశాట్-2 సీరీస్ (730 కెజి ప్రయిమరీ పేలోడ్), ఐఎన్ఎస్- 1ఎ, 1బి ( ఒక్కొక్కటి 30 కెజి).ఈ విషయాన్ని నిన్న లోక్ సభలో ప్రధాని కార్యాలయ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు.
ఈ ఘన విజయాన్ని భారతీయులందరికీ చేరవేసేందుకు ఈ వార్త షేర్ చేయండి
