నింగిలోకి దూసుకెళ్లిన పిఎస్ఎల్వి సి 36

ఇస్రో రేసు గుర్రం పిఎస్ ఎల్ వి మరోసారి నింగిలోకి దూసుకెళ్లంది.

భారత అంతరిక్ష ప్రయోగకేంద్రం సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి బుధవారం ఉదయం 10.25 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ-36 విజయవంతంగా ప్రయోగించారు.

పీఎస్‌ఎల్‌వీ సీ-36 రాకెట్ ప్రయోగాన్ని నాలుగు దశల్లో పూర్తి చేశారు. 44.4 మీటర్లు ఎత్తున్న పీఎస్‌ఎల్‌వీ సీ-36 రాకెట్‌ను ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్ల సాయంతో ప్రయోగించారు.

ఈ రాకెట్ ద్వారా 1,235 కిలోల బరువున్న రిసోర్స్‌ శాట్-2 ఏ ను సూర్యానువర్తన ధృవకక్ష్యలో ప్రవేశపెట్టారు.