ఈ ప్రయోగం ఇలా జరిగింది.

9.46 కక్ష్యలోకి చేరిన కార్టోశాట్

9.43 సవ్యంగా సాగుతున్న రాకెట్ ప్రయోగం నాలుగో దశ

ఈ ప్రయోగంతో మూడు దేశీయ, 28 విదేశీ ఉపగ్రహాలు నింగిలోకి

 

9.38 సవ్యంగా సాగుతున్న నాలుగవ దశ

9.36 నాలుగో దశ ప్రారంభం

9.35 రాకెట్ ప్రయోగంలో మూడో దశ విజయవంతం

9.34 మరికొద్ది నిమిషాల్లో కక్షలోకి ఉపగ్రహాలు

9.33 కొనసాగుతున్న ఉపగ్రహ ప్రయోగం

9.32 రెండోదశ విజయవంతం

పీఎస్‌ఎల్‌వీ నుంచి విడిపోయిన హీట్ షీట్

9.30 మొదది దశ విజయవంతం

9.28 నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ 40 రాకెట్

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి వందో శాటిలైట్‌ను ప్రయోగించింది.

పీఎస్‌ఎల్‌వీ సీ-40 రాకెట్‌ ద్వారా స్వదేశీ ఉపగ్రహం కార్టోశాట్‌-2ఈఆర్‌తో పాటు మరో 30 ఉపగ్రహాలను ఒకేసారి రోదసిలోకి పంపించారు.

కార్టోశాట్‌-2ఈఆర్‌ పంపించే ఫొటోల ఆధారంగా గ్రామీణ, పట్టణ ప్రాంత భూముల లెక్కలను పక్కాగా గుర్తించొచ్చు.

తీరప్రాంత భూములను గుర్తించడంతో పాటు వాటి వినియోగాన్ని లెక్క కట్టొచ్చు.

నీటి పంపిణీ వ్యవస్థ, రోడ్‌ నెట్‌వర్క్ పరిశీలన, నావిగేషన్ అప్లికేషన్లకు కూడా కార్టోశాట్ పంపించే ఫొటోలు ఎంతో ఉపయోగపడతాయి.

భూ వాతావరణంలో మార్పులను గుర్తించడానికి ఇది సహాయం చేస్తుంది.

కార్టోశాట్‌తో పాటు మరో 30 ఉపగ్రహాలను రోదసిలో ప్రవేశపెడతారు.

ఇందులో మైక్రోశాటిలైట్, నానోశాటిలైట్‌ భారత్‌కు చెందినవి కాగా.. మిగిలిన 28 ఇతర దేశాలకు సంబంధించినవి.

కార్టోశాట్‌-2ఈఆర్‌ బరువు 710 కేజీలు. దీని కాలపరిమితి ఐదేళ్లు.

కార్టోశాట్‌-2ఈఆర్‌ పంపించే ఫొటోల ఆధారంగా గ్రామీణ, పట్టణ ప్రాంత భూముల లెక్కలను పక్కాగా గుర్తించొచ్చు.

ఒక్క ప్రయోగం.. 31 ఉపగ్రహాలు!

పీఎస్‌ఎల్‌వీ సీ-40 రాకెట్ మొత్తం 31 ఉపగ్రహాలను మోసుకెళ్తోంది. ఇందులో భారత్‌కు చెందిన కార్టోశాట్‌-2ఈఆర్‌ ప్రధానమైంది.

గతంలో ప్రయోగించిన 6 కార్టోశాట్ ఉపగ్రహాల మాదిరిగానే కార్టోశాట్‌-2ఈఆర్‌ కూడా రిమోట్ సెన్సింగ్ శాటిలైట్.

భూమికి 505 కిలోమీటర్ల ఎత్తులో భూకేంద్ర కక్షలో ఈ శాటిలైట్‌ను ప్రవేశపెడతారు. వెంటనే ఇది తన పని ప్రారంభిస్తుంది.

మైక్రోశాట్‌ విశేషాలు

కార్టోశాట్‌తో పాటు భారత్‌కు చెందిన మైక్రోశాట్‌ను కూడా పీఎస్‌ఎల్‌వీ సీ-40 ద్వారా ప్రయోగిస్తున్నారు.

మైక్రో శాటిలైట్‌ను ఇస్రో తయారు చేసింది.ఇది సుమారు వంద కిలోల బరువు ఉంటుంది.ఐఎంఎస్-1 ఉపగ్రహాన్ని పోలి ఉంటుంది.

నానో శాటిలైట్‌-1సీ విశేషాలు

ఇస్రో ప్రయోగిస్తున్న 31 ఉపగ్రహాల్లో ఇదొకటి.

భారత్‌కు చెందిన నానో శాటిలైట్ సిరీస్‌-ఐఎన్‌ఎస్‌లో ఇది మూడోది.11కిలోల బరువు ఉంటుంది. దీని కాల పరిమితి ఆరు నెలలు.మినియేచర్ మల్టీ స్పెక్ట్రల్‌ టెక్నాలజీ డెమానుట్రేషన్-ఎంఎంఎక్స్‌-టీడీ సాంకేతికతను ఉపయోగిస్తుంది.ఐఎన్‌ఎస్‌-1సీ తీసిన ఫొటోల ఆధారంగా స్థలాకృతికి సంబంధించిన మ్యాప్‌లు తయారు చేస్తారు.