Asianet News TeluguAsianet News Telugu

శ్రీహరి కోట నుంచి ఈ నెల 23న 34 ఉపగ్రహాల ప్రయోగం

జిఎస్‌ఎల్‌వి మార్క్ 3 ప్రయోగం చేపట్టి 20రోజుల కాకముందే మరో ప్రతిష్ఠాత్మకత ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శ్రీకారం చుట్టింది. 34 ఉపగ్రహాలను రోదసీలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు  సన్నాహాలు చేస్తున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ థావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్) నుంచి ఈ నెల 23న పిఎస్‌ఎల్‌వి-సి 38 రాకెట్ ప్రయోగం జరిపేందుకు ఇస్రో మూహర్తం ఖరారు చేసింది.

isor to launch 34 satellites from Sriharikota on June 23

 

జిఎస్‌ఎల్‌వి మార్క్ 3 ప్రయోగం చేపట్టి 20రోజుల కాకముందే మరో ప్రతిష్ఠాత్మకత ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శ్రీకారం చుట్టింది.


 34 ఉపగ్రహాలను రోదసీలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు  సన్నాహాలు చేస్తున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ థావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్) నుంచి ఈ నెల 23న పిఎస్‌ఎల్‌వి-సి 38 రాకెట్ ప్రయోగం జరిపేందుకు ఇస్రో మూహర్తం ఖరారు చేసింది.

 

ఈ రాకెట్ ద్వారా మన దేశానికి చెందిన ప్రధాన ఉపగ్రహం కార్టోశాట్-2ఇతో పాటు విదేశాలకు చెందిన మరో 33విదేశాలకు చెందిన చిన్న ఉపగ్రహాలను ఒకేసారి కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.


ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్ని షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక వద్ద చురుగ్గా సాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం రాకెట్ శిఖర భాగాన ఉపగ్రహాలను అమర్చే ప్రక్రియను శాస్తవ్రేత్తలు పూర్తిచేశారు. మరో రెండు రోజులు రాకెట్‌లోని అన్ని భాగాలు, ఉపగ్రహాల పనితీరును శాస్తవ్రేత్తలు క్షుణ్ణంగా పరిశీలించి ప్రయోగానికి సిద్ధం చేస్తారు. ప్రయోగానికి సంబంధించిన ఎంఆర్‌ఆర్ సమావేశం ఈ నెల 19లేక 20వ తేదీన జరిగే అవకాశం ఉంది. ఎం ఆర్ ఆర్ అనంతరం లాంచింగ్ ఆథరైజేషన్ బోర్డు సమావేశమై కౌంటౌడౌన్, ప్రయోగ వివరాలు వెల్లడించనున్నారు.

 

జూన్ 5 తేదీన ఇస్రో   అత్యంత బరువైన 3,136 కేజీల జీశాట్‌–19 సమాచార సమాచార ఉపగ్రహాన్ని జిఎస్.ఎల్.వి.మార్క్-3డి-1 (ఉపగ్రహవాహక నౌక) ద్వారా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సాయంత్రం 5.28 గంటలకి అంతరిక్షంలోకి పంపించిన సంగతి తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios