ఈ మధ్యంతర ఎన్నికలకు బలం చేకూర్చేలా మాజీ సీఎం ప‌న్నీర్ సెల్వం కాంచీపురంలోని ఓ స‌మావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో త్వరలోనే మధ్యంతర ఎన్నికలు వస్తాయని దానికి పార్టీ శ్రేణులు సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు.అన్నాడీఎంకే పార్టీ తమదేనని మరోసారి స్పష్టం చేశారు.

జయలలిత మృతి తర్వాత తమిళనాట రాజకీయాల్లో సంక్షోభం నెలకొంది. ముఖ్యంగా ఆమె పార్టీ అన్నా డీఎంకే ఇప్పుడు అనాథైపోయింది. చిన్నమ్మ సీఎం కుర్చీ కోసం వేసిన ఎత్తుగడ ఫలించకపోగా జైలుకు వెళ్లే పరిస్థితి వచ్చింది.

ఈ నేపథ్యంలో ఆమె నమ్మిన బంటు ప్రస్తుత సీఎం పళనిస్వామి కూడా మన్నారు గుడి మాఫియాకు చెక్ పెట్టేందుకు సిద్ధమైన తరుణంలో రాష్ట్రంలో కొత్త ఉపద్రవం ముంచుకొస్తుంది. అదే మధ్యంతర ఎన్నికలు.

ఒకవైపు పన్నీరు, పళనిస్వామి ఏకమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో శశికళ వర్గం కూడా తన బలాన్ని పెంచుకునేందుకు సిద్ధమవుతుంది.ఇలా రెండాకుల పార్టీ రెండుగా విడిపోతే ఇక మధ్యంతరం తప్పదు.

ఈ మధ్యంతర ఎన్నికలకు బలం చేకూర్చేలా మాజీ సీఎం ప‌న్నీర్ సెల్వం కాంచీపురంలోని ఓ స‌మావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో త్వరలోనే మధ్యంతర ఎన్నికలు వస్తాయని దానికి పార్టీ శ్రేణులు సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు.అన్నాడీఎంకే పార్టీ తమదేనని మరోసారి స్పష్టం చేశారు.

అయితే పళనివర్గంతో కలిసి ఆయన మధ్యంతర ఎన్నికలకు వెళుతారా... లేక తనే సారథిగా పోటీలోకి దిగుతారా అనేది తెలియడం లేదు.ఇప్పటి వరకు పన్నీరు, పళిని మధ్య చర్చలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఒక వేళ ఇద్దరు కలసినా పార్టీని శశికళ వర్గం నేతలు చీల్చే అవకాశం ఉన్నట్లు కొందరు అంచనా వేస్తున్నారు.

ఆర్కే నగర్ ఎన్నికలు వాయదా పడ్డాక ఇప్పుడు మధ్యంతరపైనే అక్కడ ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి.