ఈ నోటులో కొవ్వుందా..?

is new indian rupee 2000 note have cholesterol
Highlights

  • రూ.2000 నోటుకు శల్య పరీక్షలు
  • నూనెలో వేయిస్తున్నారు.. వాషింగ్ మిషన్లో ఉతికేస్తున్నారు
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోలు

 

పెద్ద నోట్ల రద్దు అయి ప్రజలంతా నానా కష్టాలు పడుతుంటే.. కొత్తగా వచ్చిన కొత్త రూ. 2 వేల నోటుకు మరో రకం కష్టాలు వచ్చాయి.పేరుకు పెద్ద నోటైనా దానికి విలువే లేకుండా పోయింది. జనాలు తమ వద్దకు వచ్చిన రూ. 2 వేల నోటుకు రకరకాల పరీక్షలు పెడుతున్నారు.

సోషల్ మీడియాలో ఈ పరీక్షలు వైరల్ గా మారాయి. ఇప్పటికే ఈ నోటుపై అనేక పుకార్లు వినిపించాయి.

 

నోటులో చిప్ ఉందని, ఆ చిప్ ఉండటం వల్ల దొంగనోట్ల ముద్రణకు అవకాశమే ఉండదని రుమర్లు వచ్చాయి. దీనిపై ఆర్బీఐ స్పందించి అలాంటిది ఏమీ లేదని ప్రకటించింది.

 

ఇటీవల రూ. 2 వేల నోటును కొందరు ఉత్సాహవంతులు వాషింగ్ మిషన్లు వేసి ఉతికేశారు. తర్వాత నోటు ఎలా ఉందో వీడియో పోస్టింగ్ చేశారు.

 

ఇంతటితో ఆగారా... ఇప్పుడు అదే నోటుపై మరో ప్రయోగం చేపట్టారు.

రూ. 2 వేల నోటును జంతువుల కొవ్వుతో తయారు చేశారని ప్రచారం చేస్తున్నారు. అదో నాన్ వెజ్ నోటు అని

 

శాఖాహారులు ముట్టుకోవద్దని వాట్సాప్ లో సందేశాలు పంపుతున్నారు. అక్కడితో ఆగకుండా నూనెలో రూ. 2 వేల నోటును మరిగించి పరీక్షించారు.

 

రెండు వేల నోటు గుండెకు ప్రమాదకరమని అందుకే దాన్ని షర్ట్ జేబులో పెట్టుకోవద్దని, శాఖాహారులు అయితే నోటును ముట్టుకున్నాక చేతులను శుభ్రంగా సబ్బుతో కడగాలని ఉచిత సలహా కూడా ఇస్తున్నారు.

సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతున్న ఈ కహానీలన్నీ నమ్మేస్తే నిజంగానే మీకు గుండె పోటు వస్తుంది జాగ్రత్త.

 

loader