Asianet News TeluguAsianet News Telugu

మైదాపిండి అంత ప్రమాదమా?

  • మనం ఇంతగా ఇష్టంగా తింటున్న ఈ మైదాపిండి నిజంగా ఆరోగ్యానికి మేలు చేసేదేనా అంటే.. కాదనే సమాధానమే వినిపిస్తోంది.
Is maida really harmful to health

మైదాపిండి( ఆల్ పర్పస్ ఫ్లోర్) ఈ మధ్యకాలంలో ఎక్కువగా వాడుతున్న పిండి ఇది. రోటీలు, పిజ్జాలు, పరోటా.. ఒకటి కాదు.. ఇలా చాలా రకాల వంటలను మైదాపిండితోనే తయారు చేస్తున్నారు. అయితే.. మనం ఇంతగా ఇష్టంగా తింటున్న ఈ మైదాపిండి నిజంగా ఆరోగ్యానికి మేలు చేసేదేనా అంటే.. కాదనే సమాధానమే వినిపిస్తోంది. దీని వల్ల లాభాలు లేకపోగా.. నష్టాలు మాత్రం చాలానే ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

మైదాపిండిలో ఎలాంటి పోషకాలు ఉండవని నిపుణులు చెబుతున్నారు. ఈ పిండిని గోధుమల నుంచి తయారు చేసినప్పటికీ.. దీనిని తయారుచేసే క్రమంలో చాలా మార్పులు చేస్తారు. పిండిని తయారుచేసేటప్పుడు మొదట తవుడును తొలగిస్తారు. ఆ తర్వాత విటమిన్లు, ఖనిజాలు ఉండే భీజాన్ని తొలగిస్తారు. అదేవిధంగా పిండిని శుద్ధిచేసే క్రమంలో అందులో ఉండే ఫైబర్, కాల్షియం వంటివి 50శాతంపైగా తొలగిస్తారు.

 గోధుమలను మిల్లులో బాగా పాలిష్ చేసి, రసాయనాలు కలిపి దీనిని తయారుచేస్తారు. రసాయనాల వల్ల పిండి బాగా తెల్లగా, మెత్తగా మారిపోతుంది. దీంతో దీనిని బ్లీచ్డ్, రిఫైండ్ ఫ్లోర్ అని కూడా అంటుంటారు. మైదాలో అలొక్సన్ అనే విషపూరితమైన రసాయనం వాడుతారని, అందువల్ల మైదా పిండి ముట్టుకోవడానికి మెత్తగాను, చూడటానికి తెల్లగానూ ఉంటుంది.

మైదాపిండి తయారీ చివరిదశలో, పొటాషియం బ్రోమేట్ను అదనంగా జోడిస్తారు. ఇది శరీర కణాలను నష్టపరిచే ఒక శక్తివంతమైన ఆక్సిడైజర్. కొన్ని దేశాలలో, ఈ బ్రోమేట్ను కొన్ని రకాల క్యాన్సర్ కి కారకమని భావించి, దానిపై నిషేధం విధించారు. మైదా పిండిని తినడానికి ఏవైనా కీటకాలని ప్రయత్నిస్తే, అవి తక్షణమే మరణిస్తాయి. ఎందుకంటే మైదాపిండి అనేది సహజమైన క్రిమి-సంహారకారిగా ఉంటూ, తినే కీటకాలను వెంటనే చంపుతుంది. అంతేకాదు.. మైదాపిండితో తయారుచేసే వంటకాలు ఎక్కవగా తీసుకుంటే డయాబెటిస్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios