Asianet News TeluguAsianet News Telugu

సివిల్స్ టాపర్ రోణంకి మీద కోచింగ్ సంస్థలు పగబట్టాయా?

సివిల్స్ టాపర్  రోణంకి గోపాలకృష్ణ మీద ఎవరైనా పగబట్టారా అనే అనుమానాలు ప్రబలుతున్నాయి. సివిల్స్ ఛేదించేందుకు కోచింగ్ అవసరం లేదని రోణంకి నిరూపించారు. ఫలితంగా  కొన్ని కోచింగ్ సంస్థలు ఆయనను  ఎలాగయినా బజారుకీడ్చాలని చూస్తున్నాయని  అయన  మిత్రులు, ఆయననుంచి స్ఫూర్తి పొందిన వారు అనుమానిస్తున్నారు.

Is civils topper ronanki falling victim of unscrupulous coaching centres

సివిల్స్ టాపర్  రోణంకి గోపాలకృష్ణ మీద ఎవరైనా పగబట్టారా?

అనే అనుమానాలు ప్రబలుతున్నాయి.

కొన్ని కోచింగ్ సంస్థలు ఆయనను  ఎలాగయినా బజారుకీడ్చాలని చూస్తున్నాయని  అయన  మిత్రులు అనుమానిస్తున్నారు.

తాను టాపర్ గా నిల్చాక, అంతో ఇంతో డబ్బు తీసుకుని ఫలానా కోచింగ్ సెంటర్ లో నే కోచింగ్ తీసుకున్నానని చెప్పడకుండా రోణంకి  మిడిసిపోయాడని,.దీనితో అతన చరిత్రను తవ్వడం మొదలుపెట్టారని, దీని ఫలితమే ఆయన  మీద కేసు అని చాలా మంది అనుమానిస్తున్నారు.

 దీనికి రోణంకి చక్కటి సమాధానం చెప్పిన వ్యవహారం కోర్టుదాాకా వెళ్లింది. 

తను అంగవైకల్యం గురించి యుపిఎస్ సి ఏర్పాటుచేసిన డాక్టర్ల ప్యానెల్ క్షుణ్ణంగా పరిశీలించిందని, ఆ ప్యానెల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికేట్ ను, ధృవీకరించిందని రోణంకి కోర్టు నోటీసుకు స్పందిస్తూ వివరణ ఇచ్చారు.

అయితే, ఈ వ్యవహారం కోర్టులో నే తేాలాలి.

ఆయనకు సోషల్ మీడియాలో బాగా మద్దతు లభిస్తూ ఉంది.

ఒక పోస్టులో ఆయనకు మద్దతు ఇలా వచ్చింది.

‘‘మాతోనే పెట్టుకుంటావా!
గోపాల‌కృష్ణా నీకెంత ధైర్యం. మాతోనే పెట్టుకుంటావా?
చూశావుగా మా దెబ్బ ఎలా ఉంటుందో.  ఇది శాంపిల్ మాత్ర‌మే. 
అయినా మ‌మ్మ‌ల్ని కాద‌ని నువ్వు ఎక్క‌డికి పోగ‌ల‌వు. 
ఇప్ప‌టికైనా మేం చెప్పేది ఒప్పుకో
శ్రీకాకుళం జిల్లాలో చిన్న ఊరు నుంచి వ‌చ్చి మ‌మ్మ‌ల్ని ఎదిరిస్తావా?
ఏం చూసుకుని నీకా ధైర్యం!
సివిల్స్‌లో నాలుగోసారి కానీ నువ్వు గ‌ట్టెక్క‌లేక‌పోయావు. 
అంటే నీ ప‌ట్టుద‌ల ఏంటో మాకు చూపించాల‌నుకున్నావా? 
కోచింగ్ కోసం వ‌చ్చిన‌ప్పుడు ఛీ.. పో... అన్నందుకు క‌సి తీర్చుకుంటున్నావా!
ఎలాగో అలా తెలుగు మీడియంలో రాసేసి గ‌ట్టెక్కిపోయాన‌న్న ధీమానా
క‌ష్ట‌ప‌డి చ‌దివి సాధించావు స‌రే... 
మా అంత‌ట మేమే నీకు మా కార్పొరేట్ స్థాయిని క‌ల్పిస్తే వ‌ద్దంటావా?
మేము కొంటామంటే నువ్వు అమ్ముడుపోవా
ఏంటి... మ‌మ్మ‌ల్నే కాద‌ని నిల‌బ‌డే స‌త్తా నీకు ఉందా
నీ పేరుతో మేం ప్ర‌చారం చేసుకుంటే కాద‌ని అడ్డుకుంటావా
మీడియా ముందుకొచ్చి మా కోచింగ్ తీసుకోలేద‌ని చెబుతావా
ఎంత ధైర్యం... నీకెంత ధైర్యం 
అందుకే నీ బ్యాక్‌గ్రౌండ్ బ‌య‌ట‌కు లాగుతున్నాం. 
ఎప్పుడో యాక్సిడెంట్ అయితే... విక‌లాంగుడ‌ని చెప్పుకుంటావా
సారీ... ఇప్పుడు నిన్ను దివ్యాంగుడు అనాలేమో క‌దా
నువ్వు ఎవ‌రైనా స‌రే... ఎంత బాగా చ‌దివినా స‌రే... 
మేం చెప్పిన దానికి నువ్వు ఒప్పుకోవాలి. 
లేదంటే ఇదిగో ఇలాగే ఉంటుంది 
కాచుకో గోపాల‌కృష్ణా... కాచుకో..’’

Follow Us:
Download App:
  • android
  • ios