ఎపి ఐఎఎస్ ఆఫీసర్ల అసోసియేషన్ బీహార్ అసోసియేషన్ నుంచి నేర్చుకోవలసింది చాలా ఉంది
కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు ను ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి అవమానపర్చాడని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెగ ఫీలయిపోయారు. దానితో ఐఎఎస్ ఆఫీసర్ల అసోయేషన్ కూడా బోరున విలపించింది. కలెక్టర్ బాబు విషయంలో. ఆ మాట కొస్తే నందిగామా డాక్టర్ విషయంలో కూడా జగన్ తీరు తప్పు పట్టాల్సిందే. అయితే, అది ఐఎఎస్ అసోసియేషనో, ముఖ్యమంత్రి చంద్రబాబో చేస్తే ఎలా?
సాటి ఐఎఎస్ ఆఫీసర్ల మీద సానుభూతి కురిపించే నైతిక హక్కు అసోసియేషన్ కు నిజంగా ఉందా.
ఎందుకంటే,ప్రతి సారి ప్రభుత్వం సీనియర్ ఐఎఎస్ ఆఫీసర్లను అవమాన పరుస్తూనే ఉంది. ఎపుడయినా ఈ అసోషియేషన్ ఇలా ఎమర్జన్సీ సమావేశం వేసుకుని ఖండించిందా.
మొన్నటికి మొన్న ఎకెపరీడాను కాదని జూనియర్లను చీఫ్ సెక్రెటరీ చేస్తే అసోసియేషన్ పల్లెత్తు మాట అనలేదు. ఆయన 1980 బ్యాచ్ ఆఫీసర్. ఆయనను కాదని 1981 బ్యాచ్ ఆఫీసర్ ఎస్ పి టక్కర్ ను చీఫ్ సెక్రెటరీ చేశారు. అంతేకాదు,రాష్ట్రంలో సీనియర్ మోస్ట్ ఐఎఎస్ ఆఫీసర్ అయిన పరీడాను ఆఫీస్ కూడా లేని పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ డిపార్టమెంటుకు బదిలీ చేసి, ఇపుడు వెలగపూడిలో ఆఫీసు కూడా కేటాయించకపోయినా, ఈ అసోసియేషన్ పల్లెత్తు మాట అనలేదు.
వచ్చే నెలలో చీఫ్ సెక్రెటరీ కానున్న దినేష్ కుమార్ (1983)ను హఠాత్తుగా స్టేట్ కు రికాల్ చేసి పోస్టింగ్ ఇవ్వకుండా మూలన పడేసినా ఈ అసోసియేషన్ ఒక మాట మాట్లాడలేదు. పోలవరం సెంట్రల్ అధారిటీ సెక్రెటరీ ఉన్న దినేష్ కుమార్ ను ఉన్నట్లుండి అక్కడ నుంచి తప్పించిందెవరు? ఈ అసోషియేషన్కు అవసరం లేదు. గిరిధర్ (1988 AP) ని అవమాన పరిస్తే ఆయన సెంట్రల్ డిప్యూటేషన్ కు పోలేదా. ఇవేవి పట్టించుకోకుండా జగన్ మీద తీర్మానం చేయడం మంటే దాని వెనక రాజకీయాలున్నట్టే కదా.
ఈ విషయంలో ఆంధ్ర ఐఎఎస్ అధికారులు బీహార్ నుంచి చాలా నేర్చుకోవాలి. వాళ్లీ మధ్య ముఖ్యమంత్రికొక లేఖ రాశారు. సహచరుడి కోసం ముఖ్యమంత్రి మీద యుద్ధం ప్రకటించారు. అవినీతి అరోపణలతో అరెస్టయిన సీనియర్ ఆఫీసర్ సుధీర్ కుమార్ ని ధైర్యంగా బలపర్చారు. ఆయన అవినీతి పరుడు కాదని వాదించారు. ముఖ్యమంత్రి కి లేఖ రాశారు. ఇలా కేవలం ఆరోపణలతో అరెస్టులు చేస్తూ పోతే, ముఖ్యమంత్రినుంచి మౌఖిక ఉత్తర్వుల తీసుకుని పనిచేసేదే లేదు పొమ్మన్నారు. ఈ యుద్ధం ఎవరి మీద? అల్లాట ప్పా సిఎం మీద కాదు, అంతో ఇంతో మంచిపేరున్న నితిష్ కుమార్ మీద.
1977బ్యాచ్ ఐఎఎస్ ఆఫీసర్ షఫీకుజ్జామా ను గత ప్రభుత్వం ఫుడ్ బాల్ లా అడుకుంటున్నపుడు ఈ అసోషియేషన్ ఒక్క మాట మాట్లాడ లేదు.
ఆయనను చీఫ్ సెక్రటరీ చేయలేదు, ఆ హోదాకు తగ్గ పోస్టులో కూడా నియమించ కో పోవడం అవమానం కాదా? అంతేకాదు, ఒకదశలో ఆయన ఉన్నపుడే మరొక్ ఆఫీసర్న్ కూడా గిడ్డంగుల శాఖకార్పొరేషన్ ఎండిగా నియమించినపుడు ఎవరూ మాట్లాడలేదు. ఐఎఎస్ కు అవమానం జరిగిందని అడగలేదు. ఆయనే కోర్టుకువెళ్లి ప్రభుత్వానికి ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్పి రిటైరయ్యారు.
చెప్పొచ్చేదేమంటే, ఐఎఎస్ ఆఫీసర్ల అసోసియేషన్ ముఖ్యమంత్రి కార్యాలయం యాంటిరూం కాకూడదు. అసోసియేషన్ బీహార్ అసోసియేషన్ లాగా ఉండాలి.

ఆంధ్రలో సిబిఐ అనేక మంది ఆఫీసర్లను అరెస్టు చేస్తున్నపుడు ఈ అసోసియేషన్ ఒక్క మాట మాట్లాడలేదు. ఇపుడు ముఖ్యమంత్రి అండచూసుకుని తగిలించుకున్న కోరలతో బెదిరించాలని చూస్తున్నది.
అయితే, ఎపుడో ఐఎస్ అధికారుల గురించి ములాయం సింగ్ యాదవ్ చేసిన ఒక హెచ్చరిక అసోసియేషన్ కు ఈ సందర్భంగా గుర్తు చేయాల్సిన అవసరం ఉంది.
"You all have such excellent minds and education -- you are all respect (ed) by society -- why do you come and touch my feet? Why do you come to me for personal favours? When you do so, I will do as you desire and then extract my price from you".
ఉత్తర ప్రదేశ్ ఐఎఎస్ అధికారుల అసోయేషన్ సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరయిన ములాయం సింగ్ ఈ హెచ్చరిక చేశారు. దీనిని Journeys through Babudom and Netaland: Governance in India లో మాజీ క్యాబినెట్ కార్యదర్శి TSR Subramanian (1962 UP) ఉదహరించారు.
