అనుకొకుండా పువ్వును తీసుకెళ్లినా లేడీ. కంగారు పడ్డా యజమాని పోలీసులకు పిర్యాదు చేశాడు.
పువ్వు పోతే పోలీసులకు కంప్లైంట్ చేయ్యడం అనుకుంటున్నారా.. అది సాధారణ పువ్వు కాదండి ఆ పువ్వుధర అక్షరాల 20 కోట్లు. ఆశ్చర్యపోతున్నారు. కదా.. అయితే జరిగిన విషయం చూడండి మీకే అర్ధమవుతుంది.
చైనా దేశంలో ఒక ఫ్లవర్ షాప్ ఉంది . ఆ ప్లవర్ షాపు ప్రముఖ పూలకు ఫేమస్. ప్రతి రోజు వేలాది మంది అక్కడ పూలు కొనడానికి వస్తుంటారు. మంగళవారం కూడా ఓ మహిళ ఆ షాపులో పుష్పాన్ని కొనుగోలు చేసింది. మొదట ఆ మహిళ కొన్న పూలు నచ్చలేదు. తక్షణమే అక్కడే పక్కన ఉన్న మరో పూలను తీసుకుంది.
కానీ ఆ విషయాన్ని ఆ పూల షాపు యజమానీ గమనించలేదు. సాయంత్ర షాపు మూసివేస్తున్నప్పుడు ప్రతి రోజు అక్కడ ఒక ప్రత్కేకమైన పువ్వు ఉండేది కానీ సాయంత్రానికి అది లేదు. దీనితో ఆందోళన చెందిన ఆ యజమాని పువ్వు పోయిందని పోలీసులకు పిర్యాదు చేశాడు
ఆ పువ్వు పేరు ఐరీస్ జపొనికా(బటర్‌ఫ్లై ఫ్లవర్) ఇది అచ్చం బ్లటర్ ప్లై ని పోలీ ఉంటుంది. ఆ యజమానీ ఐరీస్ జపొనికా ని ఎనిమిది సంవత్సరాల నుండి ఎంతో కష్టపడి పెంచుతున్నాడు. దాని విలువ దాదాపు రూ. 20కోట్ల పైనే ఉంటుంది.
ప్రస్తుతం అలాంటి పుష్ఫం ఒక్కటే ఉంది. దీని ద్వారా మరిన్ని పష్ఫాలను తయారు చేయాలని యజమానీ అనుకున్నాడు, కానీ ఉన్నది ఒకే ఒక్క పుష్ఫాన్ని ఆ మహిళ తీసుకెళ్లింది. దీంతో షాపు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు షాపులోని సీసీ కెమెరాలు పరిశీలించి ఆమె కారు నెంబరు ఆధారంగా చిరునామా కనుక్కొని ఇంటికి వెళ్లారు. ఆ పుష్పాన్ని ఇతరులకు గిప్టుగా ఇచ్చే ప్రయత్నంలో ఉన్న ఆ మహిళ. ఎవ్వరికి ఇవ్వక ముందే పుష్పాన్ని కనుక్కోగలిగారు. చివరికి ఆ షాపు యజమాని ఉపిరి పీల్చుకున్నాడు.
ఈ పువ్వు కేవలం చైనా, జపాన్ దేశాల్లో మాత్రమే దొరుకుంది. ఇది అచ్చం సీతాకోకచిలుకను పోలీ ఉంటుంది. ఆ పుష్ఫం నుండి వచ్చే వాసన చాలా అద్బుతంగా ఉంటుందట.
