సన్ రైజర్స్ కి వార్నర్ అవసరం లేదు

First Published 6, Apr 2018, 2:16 PM IST
IPL 2018: Sunrisers Hyderabad Unaffected by David Warner Ouster
Highlights
బాల్ ట్యాంపరింగ్ చేసినందుకు వార్నర్ పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే

ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కి క్రికెటర్ డేవిడ్ వార్నర్ లేకున్నా పెద్దగా వచ్చిన నష్టం ఏమీ లేదని సన్ రైజర్స్ కోచ్ టామ్ మూడీ అన్నారు. 2014 నుంచి వరసగా నాలుగు సంవత్సరాల పాటు వార్నర్.. సన్ రైజర్స్ టీంలో ఆడుతూనే ఉన్నాడు.  అంతేకాదు.. ఆ టీంలో టాప్ స్కోరర్ కూడా వార్నరే. 2016లో కెప్టెన్‌గా జట్టును గెలిపించడంలో కూడా కీలక పాత్ర పోషించాడు. కానీ.. ఇటీవల బాల్ ట్యాంపరింగ్ కి పాల్పడి నిషేధానికి గురయ్యాడు. కాగా.. వార్నర్ లేని సన్ రైజర్స్ టీంని అభిమానులు ఊహించలేకపోతున్నారు. దీంతో.. ఈ విషయంపై కోచ్ టామ్ మూడీ స్పందించారు.
వార్నర్‌ లేకపోవడాన్ని తాము లోటుగా భావించడం లేదని రైజర్స్‌ కోచ్‌ టామ్‌ మూడీ స్పష్టం చేశారు. అతను గొప్ప బ్యాట్స్‌మన్‌ అనడంలో సందేహం లేదని, అయితే ఆ స్థానంలో వచ్చే ఆటగాడు కూడా అలాంటి ప్రదర్శన ఇవ్వగలడని తాము నమ్మతున్నట్లు మూడీ వ్యాఖ్యానించారు.

‘కారణాలు ఏమైనా వార్నర్‌ టీమ్‌లో లేడనే వాస్తవాన్ని గుర్తించాలి. ఇది టీమ్‌ గేమ్‌. ఎవరో ఒక ఆటగాడిపై ఆధారపడి ఫలితం ఉండదు. ఇదంతా సమష్టి కృషి. వార్నర్‌ స్థానంలో అవకాశం దక్కితే సత్తా చాటేందుకు ఎంతో మంది ఆటగాళ్లు మా జట్టులో సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నా దృష్టిలో ఒక తలుపు మూసుకుపోతే మరో తలుపు తెరిచే ఉంటుంది’ అని మూడీ అభిప్రాయపడ్డారు.ఈ నెల 9వ తేదీన సన్ రైజర్స్ టీం రాజస్తాన్ రాయల్స్ తో తలపడనుంది.
 

loader