ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్  మరో సరికొత్త ప్లాన్ ని తీసుకువచ్చింది. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో.. టెలికాం సంస్థలన్నీ.. పోటీలుపడి మరీ ఐపీఎల్ కోసం ప్లాన్లు ప్రవేశపెడ్తున్నాయి.ఇప్పటికే జియో, బీఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టగా.. తాజాగా ఎయిర్ టెల్ కూడా ఓ ప్లాన్ ప్రవేశపెట్టింది

.కాగా జియో ఇప్పటికే ఐపీఎల్ వీక్షకుల కోసం ప్రత్యేకంగా రూ.251కే క్రికెట్ సీజన్ ప్యాక్ పేరిట ఓ నూతన ప్లాన్‌ను రీసెంట్‌గా లాంచ్ చేసింది. ఇందులో జియో కస్టమర్లకు రోజుకు 2జీబీ డేటా చొప్పున మొత్తం 51 రోజుల వాలిడిటీకి గాను 102 జీబీ డేటా లభిస్తుంది. అటు ఐపీఎల్ మ్యాచ్‌లు కూడా 51 రోజుల పాటు జరగనున్న నేపథ్యంలో ఆ మ్యాచ్‌లను ఎలాంటి ఇబ్బంది లేకుండా మొబైల్ యాప్‌లోనూ వీక్షించేందుకు వీలుగా జియో ప్రేక్షకుల కోసం ఈ ప్లాన్‌ను ప్రవేశ పెట్టింది. 

జియో ప్రవేశపెట్టిన రూ.251 ప్లాన్‌కు పోటీగా ప్రస్తుతం ఎయిర్‌టెల్ కూడా రూ.499 కు ఓ నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో ఎయిర్‌టెల్ కస్టమర్లకు రోజుకు 2జీబీ 4జీ డేటా చొప్పున 82 రోజుల వాలిడిటీకి గాను మొత్తం 164 జీబీ డేటా లభిస్తుంది. దీంతోపాటు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఈ ప్లాన్‌లో వస్తాయి. ఈ క్రమంలో ఈ ప్లాన్‌ను రీచార్జి చేసుకునే కస్టమర్లకు రోజూ లభించే 2 జీబీ డేటాను ఉపయోగించుకుని రోజూ ప్రసారమయ్యే ఐపీఎల్ మ్యాచ్‌లను ఎయిర్‌టెల్ టీవీ యాప్‌లో వీక్షించవచ్చు.