అమేజాన్ లో ఐఫోన్ ఫెస్ట్..

iPhone X, iPhone 8, iPhone 7, and More Get Discounts in Amazon.in's Ongoing iPhone Fest
Highlights

ఐఫోన్లపై భారీ ఆఫర్లు

ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ అమేజాన్ మరోసారి డిస్కౌంట్ సేల్ తీసుకువచ్చింది. అమేజాన్ లో ప్రత్యేకంగా ఐఫోన్ ఫెస్ట్ ప్రారంభించింది యాపిల్ కంపెనీ.
ఈ సేల్ ఈ నెల 16వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా దాదాపుగా అన్ని ఐఫోన్ మోడల్స్ తగ్గింపు ధరలకే వినియోగదారులకు లభిస్తున్నాయి. 

ఐఫోన్ 10 (64జీబీ) ఎంఆర్‌పీ రూ.95,390 ఉండగా ఐఫోన్ ఫెస్ట్‌లో ఈ మోడల్ రూ.79,999 ధరకు లభిస్తున్నది. అలాగే ఐఫోన్ 10 (256జీబీ) రూ.97,999 ధరకు (ఎంఆర్‌పీ రూ.1,08,930), ఐఫోన్ 8 (64 జీబీ) రూ.54,999 కు (ఎంఆర్‌పీ రూ.67,940), ఐఫోన్ 8 (256జీబీ) రూ.68,999కు (ఎంఆర్‌పీ రూ.81,500), ఐఫోన్ 8 ప్లస్ 64జీబీ రూ.65,999కు (ఎంఆర్‌పీ రూ.77,560), ఐఫోన్ 8 ప్లస్ 256జీబీ రూ.79,999కు (ఎంఆర్‌పీ రూ.91,110) లభిస్తున్నాయి. 

ఐఫోన్ ఫెస్ట్‌లో ఐఫోన్ 7 (32జీబీ) రూ.41,999కు (ఎంఆర్‌పీ రూ.52,370), ఐఫోన్ 7 (128 జీబీ) రూ.54,999కు (ఎంఆర్‌పీ రూ.61,560), ఐఫోన్ 7 ప్లస్ 32జీబీ రూ.56,999కు (ఎంఆర్‌పీ రూ.62,480), ఐఫోన్ 7 ప్లస్ 128 జీబీ రూ.64,999 (ఎంఆర్‌పీ రూ.72,060)కు లభిస్తున్నాయి. అలాగే ఐఫోన్ 6ఎస్ 32జీబీ రూ.33,999కు (ఎంఆర్‌పీ రూ.42,900), ఐఫోన్ 6ఎస్ ప్లస్ 32 జీబీ రూ.37,999 కు (ఎంఆర్‌పీ రూ.52,240), ఐఫోన్ 6 (32జీబీ) రూ.23,999కు (ఎంఆర్‌పీ రూ.31,900), ఐఫోన్ ఎస్‌ఈ 32 జీబీ రూ.17,999కు (ఎంఆర్‌పీ రూ.26వేలు) లభిస్తున్నాయి. అదేవిధంగా యాపిల్ వాచ్ సిరీస్ 3 జీపీఎస్ 38 ఎంఎం రూ.32,380కి (ఎంఆర్‌పీ రూ.32,380), యాపిల్ వాచ్ సిరీస్ 3 జీపీఎస్ 42ఎంఎం రూ.31,900కి (ఎంఆర్‌పీ రూ.34,410) లభిస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తే అదనంగా డిస్కౌంట్‌ను కూడా అందిస్తున్నారు. 

loader