ఐఫోన్లపై బంపర్ ఆఫర్ ప్రకటించిన అమెజాన్

First Published 10, Apr 2018, 5:10 PM IST
iphone big discounts on amazon
Highlights
ఐఫోన్లపై బంపర్ ఆఫర్ ప్రకటించిన అమెజాన్

అమెజాన్‌ వెబ్‌సైట్, యాప్‌లలో ఐఫోన్ ఫెస్ట్ పేరిట  నిర్వహిస్తున్న  స్పెషల్‌ సేల్‌ను మంగళవారం ప్రారంభించింది. ఈ నెల 16వ తేదీ వరకు ఈ ప్రత్యేక విక్రయాలు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా దాదాపుగా అన్ని ఐఫోన్ మోడల్స్  స్మార్ట్‌ఫోన్లు భారీ తగ్గింపు ధరలతో వినియోగదారులకు లభిస్తున్నాయి. ఐఫోన్ ఎ‍క్స్‌, ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ 7, ఐఫోన్ 6ఎస్‌, ఐఫోన్ 6 , లాంటి స్మార్టఫోన్లపై డిస్కౌంట్లు, ఇతర ఆఫర్లు అందిస్తోంది.

ఐఫోన్ ఫెస్ట్‌లో ఐఫోన్ 7 (32జీబీ) - రూ.41,999కు (ఎంఆర్‌పీ రూ.52,370)
ఐఫోన్ 7 (128 జీబీ) -రూ.54,999 (ఎంఆర్‌పీ రూ.61,560)
ఐఫోన్ 7 ప్లస్ 32జీబీ -రూ.56,999 (ఎంఆర్‌పీ రూ.62,480)
ఐఫోన్ 7 ప్లస్ 128 జీబీ -రూ.64,999 (ఎంఆర్‌పీ రూ.72,060)
ఐఫోన్ 6ఎస్ 32జీబీ -రూ.33,999 (ఎంఆర్‌పీ రూ.42,900)
ఐఫోన్ 6ఎస్ ప్లస్ 32- జీబీ రూ.37,999 (ఎంఆర్‌పీ రూ.52,240)
ఐఫోన్ 6 (32జీబీ) -రూ.23,999కు (ఎంఆర్‌పీ రూ.31,900)
ఐఫోన్ ఎస్‌ఈ 32 జీబీ -రూ.17,999 (ఎంఆర్‌పీ రూ.26వేలు) లభిస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తే అదనంగా డిస్కౌంట్‌కూడా లభ్యం. 


                                                                                      

loader