ఇదీ మన ఇంటర్నెట్ పరిస్థితి

Internet status in India is too poor
Highlights

ఇండియాలో 95 కోట్ల మందికి  ఇంటర్నెట్ అందుబాటులో లేదు

ఒకనెలరోజులుగా క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్ అనే మాట ఎక్కడ చూసిన మారమ్రోగుతూ ఉంది. అదే భారత దేశానికి శ్రీరామ రక్ష . అవినీతి నిర్మూలనకు, నల్ల ధనం రూపుమాపేందుకు, నకిలీనోట్లు నిర్మూలించేందుకు అదే మార్గం అంటున్నారు. ఆ పనేదో ముందే చేయకుండా, నోట్ల రద్దులో తలదూర్చి, ఇరుక్కు పోయి బయటకు రాలేక క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్ పాట అందుకున్నారని రోడ్ల మీద బటానీలు అమ్ముకునేవాడికి కూడ తెలిసిపోయింది.

 

ఈ నేపథ్యంలో అసోచాం(అసోసియేటెడ్ ఛేంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా) డిలాయిట్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో మన ఇంటర్నెట్ కనెక్షన్ ల గురించి ఆసక్తి కరమయిన విషయాలు వెల్లడయ్యాయి. 


110 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఇంకా  95కోట్ల మంది( 950మిలియన్)కి ఇంటర్నెట్ అందుబాటులో లేదు.


ప్రపంచంలో చౌకగా ఇంటర్నెట్ దొరుకుతున్నా, స్మార్ట్ ఫోన్లు  కూడా చవగ్గా అందుబాటులో ఉన్నా 95 కోట్ల మందికి ఇంటర్నెట్ అందుబాటులో లేదంటే మనం ఎంతప్రగతి సాధించామో తెలుసుకోవచ్చు. ఈలెక్కనా క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్ దేశమంతా విస్తరించాలంటే ఎంతకాలం పడుతుందో వూహించవచ్చు.


ఇపుడు ఇంటర్నెట్ అందుబాటులో ఉండేది కేవలం 350 మిలియన్ల మందికే .అంటే మూడున్నర కోట్లే. అంటే భారత దేశ మ్యాప్  తీసుకుంటే ఒక్క తెలంగాణాతో సమానమయినే భూభాగంలోనే ఇంటర్నెట్ ఉంటుంది. మిగతా భాగమంతా ఖాళీ.

 

3జి, 4జి   సర్వీసులు రావడంతో 2020 నాటికి మన  ఇంటర్నెట్ బేస్ 60 కోట్లకు చేరుకోవచ్చని అంచనా.

 

ప్రస్తుతం 100 కోట్ల మొబైల్ సబ్ స్క్రిప్షన్స్ ఉన్నా  ఇందలో స్మార్ట్ ఫోన్ సబ్ స్క్రిప్షన్స్ 240 మిలియన్లు మాత్రమే.2020 నాటికి గాని ఇది 500 మిలియన్ లకు చేరుకోదు.


ఇంత మందికి ఇంటర్నెట్ అందాలంటే ఇంకా చవగ్గా, అకర్షణీయమ  ప్యాకేజీలు అవసరమని ఈ నివేదిక చెప్పింది. స్థానికుల అవసరాలకు తగ్గట్టుగా యాఫ్ లు రావాలి, డిటిటల్ లిటరసీ పెరగాలి. శిక్షణఇవ్వాలి. ఇవన్నీ ఏమి జరగకుండా ఇపుడు డిజిటల్ ట్రాన్సాక్షన్ అంటున్నాం. ఇది ప్రజలకు పెద్ద శిక్షగా పరిణమించనుంది.

loader