Asianet News TeluguAsianet News Telugu

గుడ్ న్యూస్... ఇన్ఫోసిస్ లో 6 వేల ఉద్యోగాలొస్తున్నాయ్

 వివాదాలున్నా ఇన్ఫోసిస్ లో ఉద్యగాల నియమాకాలు ఆగిపోవడం లేదు, ఏటా ఆరు వేల మందిని రిక్రూట్ చేసేందుకు సన్నాహాలు

infosys to recruit techies in a big this year

పేపర్ తిరిగెసి ఐటి సెక్టర్ వార్తలు చదవాలంటే భయమవుతున్నది. 2021 నాటికి ఐటి సెక్టర్ లో  దాదాపు ఆరేడు లక్షల ఉద్యోగాలు ఊడిపోతాయని గ్రాఫ్ లు, సర్వే రిపోర్టులతో చెబుతున్నారు. ఇన్ని లక్షల ఉద్యోగాలు పోతే, హైదరాబాద్ కు పెద్ద దెబ్బ అని వేరే చెప్పనవసరం లేదు. ఎందుకంటే, ఐటి ఉద్యోగాలన్ని ఉండేది హైదరాబాద్,బెంగుళూరు, పుణే, నోయిడాలలోనే.  ఇలాంటపుడు ఈ ఆరేడు లక్షలలో హైదరాబాద్ వాటా తల్చుకుంటేనే భయమవుతంది.మనలోమాట ఐటి ఉద్యోగం అంటే పిల్లనివ్వడం లేదని జోకులు కూడా మొదలవుతున్నాయి. ఇలాంటపుడు ఇన్ఫోసిస్ నుంచి ఒక మంచి వార్త వెలువడింది.

అంతర్గంగా సిఇవొ సిక్కా రాజీనామా, శేషసాయి లేఖ తదితర వివాదాలతో ఇన్ఫోసిస్ కొంత ఆటుపోట్లకు గురయిన మాటనిజమే. ఇది సంస్థ ఎంప్లాయ్ మెంటు జనరేషన్ మీదప్రభావం చూపవని తెలుస్తున్నది.  వచ్చే రెండేళ్లలో ఏటా ఆరు వేల మందికిపైగా కొత్త ఇంజినీర్లకు ఉద్యోగాలు ఈకంపెనీలో అందుబాటులోకి వస్తాయి.  ఉద్యోగ వీసాకు సంబంధించి వివాదాలు ఉన్నా, ఆమెరికా, యూరోపియన్‌ మార్కెట్లలో ఉద్యోగ నియామక ప్రక్రియను కొనసాగుతుందట.

‘ఉద్యోగాల నియమాకాలు కొనసాగుతాయి. ఈ ఏడాది కొత్తగా ఆరు వేలమందికి ఉపాధి లభిస్తుంది. వచ్చే రెండేళ్లలో కూడా ఇదే విధంగా నియామకాలుకొనసాగుతాయి. అయితే అవి కంపెనీ వృద్ధిని బట్టి ఉంటాయి’ అని సంస్థ తాత్కాలిక సీఈవో, ఎండీ యూబీ ప్రవీణ్‌రావు అన్నారు. ఏటా 10లక్షల మంది గ్రాడ్యుయేట్‌లు విశ్వవిద్యాలయాల నుంచి బయటకు వస్తున్నారని, వీరిలో కేవలం 20-30శాతం మంది మాత్రమే ప్రతిభ కలిగిన వారు ఉంటున్నారని ఆయన చెప్పారు. ఈ కొద్ది మంది  కోసం తమతో పాటు, ఇతర కంపెనీలు పోటీపడతాయని చెబుతూ  జూన్‌ 2017 నాటికి ఇన్ఫోసిస్‌లో మొత్తం 1,98,553మంది ఉద్యోగులు ఉన్నారని ఆయన చెప్పారు.

ఇన్ఫోసిస్‌లో ఈ మధ్య వివాదాలలో చిక్కకుంది. ముఖ్యంగా 200 మిలియన్‌ డాలర్ల వెచ్చించి పనయా కొనుగోలు చేయడం మీద ఈసంస్థ వ్యవస్థాపకులు, బోర్డు సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఇదే సీఈవో విశాల్‌సిక్కా, ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ ఆర్‌.శేషసాయి సహా ముగ్గురు బోర్డు సభ్యులు వెళ్లిపోవడానికి దారి తీసింది.చివరకు నందన్‌ నీలేకనిని నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ రప్పించాల్సి వచ్చింది.

 

Follow Us:
Download App:
  • android
  • ios