2016-17లో రిక్రూట్ మెంట్లు కూడా 65 శాతం పడిపోయాయి. గతేడాది 37,916 వేల మంది ఉద్యోగాలు వదిలివేశారు. 2015-16లో వెళ్లిపోయిన వారు 34,668 మంది

టెకీలు, మేనేజర్లు పెద్ద సంఖ్యలో భారత్ సాఫ్ట్ వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ ను వదిలేసి వెళుతున్నారు. వాళ్లంతా కంపెనీని వదిలేయడంలేదు అక్కడున్న మేనేజర్లను వదిలేసిపోతున్నారనే మరొక వాదన ఉన్నా, ఇలా పెద్ద ఎత్తున కంపెనీని వదిలేసి పోవడం ఈ మధ్య ఎక్కువయింది. గత రెండుమూడేండ్లు గా ఇది కొనసాగుతున్నా, ఈ మధ్య మరీ ఎక్కువయింది.

వేతనాలు, ఉద్యోగ సంబంధాలు, ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాచర్యం కారణాలుగా చెబుతారు.

ఈ మొత్తం వ్యవహారం ఇన్ఫోసిస్ పేరును చెడగొడుతూ ఉందని అంతా అంటున్నారు.

ఇన్ఫోసిస్ దాని అనుబంధలను సంస్థల నుంచి గతేడాది 37,916 వేల మంది ఉద్యోగాలు వదిలివేసినట్టు తెలిసింది.

అంతకు ముందు సంవ త్సరం (2015-16) ఈ సంస్థలనుంచి వెళ్లిపోయిన వారి సంఖ్య 34,668 మంది.

అంతేకాక 2016-17లో రిక్రూట్ మెంట్ ప్రక్రియ కూడా 65 శాతం పడిపోయినట్టు తెలిసింది.

బెంగుళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీ 2017లో రిక్రూట్ చేసుకున్నది కేవలం 44,235మందినే. అదే 2016లో 52,545 మందిని రిక్రూట్ చేసుకున్నారు. దీనివల్ల 2017 లో సంస్థకు మొత్తంగా జోడయింది కేవలం 6320 మందే. అదే 2016లో 17,857 మంది. అంటే ఉద్యోగుల సంఖ్య65 శాతం పడిపోయింది.

టెకీ లలోనే కాదు, అనుభవం ఉన్న సీనియర్ మేనేజర్ల స్థాయిలో కూడా ఇన్ఫోసిస్ ఆకర్షణ కోల్పోయింది. పదిసంవత్సరాలకంటే ఎక్కువ అనుభవం ఉన్నవారి రిక్రూట్ మెంట్ కూడా 24,179 (2016) నుంచి 18,979 (2017 )కు పడిపోయింది.

మొత్తంగా సంస్థ ఉద్యోగాలతో పాలిస్తే వెళ్లిపోవడం 18.7 శాతం (2016) నుంచి 19.2 శాతం(2017) కు పెరిగింది.

ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు సంస్థలు చర్యలు మొదలుపెట్టిందని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ యుబి రావ్ ఒక ప్రకటనలో తెలిపారు. గత ఏడాది మూడో క్వార్టర్ నుంచి నాలుగో క్వార్టర్ నాటికి ఉద్యోగాలొదిలేయడం 14.9 శాతం నుంచి 13.5 శాతానికి తగ్గిందని ఆయనపేరొన్నారు.