బడ్జెట్ ధరలో మరో స్మార్ట్ ఫోన్

infocus released new smartphone wirthin budget range name of vision3
Highlights

  • ఇన్ ఫోకస్ నుంచి మరో స్మార్ట్ ఫోన్
  • విజన్ 3 పేరిట విడుదల చేసిన ఇన్ ఫోకస్

ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ ఇన్ ఫోకస్.. భారత మార్కెట్లో మరో స్మార్ట్ ఫోన్ ని ప్రవేశపెట్టింది. ‘విజన్‌ 3’ పేరిట మంగళవారం దిల్లీలో జరిగిన కార్యక్రమంలో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను ఆవిష్కరించింది. 5.7 అంగుళాల 18:9 హెచ్‌డీ డిస్‌ప్లే, డ్యూయల్‌ కెమెరా ఫోన్‌ దీని ప్రత్యేకతలు. దీని ధరను కంపెనీ రూ.6,999గా నిర్ణయించింది. వీవోఎల్‌టీఈ సదుపాయం కలిగిన ఈ ఫోన్‌ అమ్మకాలు అమేజాన్‌లో ఎక్స్‌ క్లూజివ్‌గా రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి.

నోకియాలో ఉన్న బోతీ ఫీచర్‌ తరహాలో ఇందులో ‘డ్యూయల్‌ఫై’ సదుపాయాన్ని కంపెనీ అందిస్తోంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ 7.0 నౌగట్‌ ఓఎస్‌తో వస్తున్న ఈ ఫోన్‌కు 2018 మధ్యలో ఓరియో అప్‌డేట్‌ లభిస్తుందని కంపెనీ చెబుతోంది.

 

ఇన్ ఫోకస్ విజన్ 3 ఫోన్ ఫీచర్లు..

5.70 ఇంచెస్ టచ్ స్క్రీన్

1.3గిగా హెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్

8మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమేరా

13మెగా పిక్సెల్, 5మెగా పిక్సెల్ వెనుక కెమేరా

2జీబీ ర్యామ్

ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టమ్

16జీబీ అంతర్గత స్టోరేజీ

4000ఎంఏహెచ్ బ్యాటరీ

loader