టిటిటి ట్రస్టు బోర్డు ఛెయిర్మన్   పదవికి అభ్యర్థిని నేడు నియమించే అవకాశం. ఈ పదవి తిరిగి ఒక పారిశ్రామిక వేత్తనే వరిస్తున్నట్లు చెబుతున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన పారిశ్రామిక  వేత్త పేరు మీద ఈ రోజు ఆమోద ముద్ర

తిరుమల తిరుపతి దేవస్థానాల పాలక మండలి ఛెయిర్మన్ పదవికి ఇపుడు కొత్తపేరు ప్రచారంలోకి వచ్చింది.

టి టి డి చైర్మన్ గా సీ.ఎం రవిశంకర్ పేరు ఖరాయినట్లు సమాచారం.

ఈ రోజు మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జరిపే సమావేశంలో ఆమోదముద్ర పడుతుందని చెబుతున్నారు.

ఈ రోజే ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త ఛెయిర్మన్ పేరు ప్రకటించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

రవిశంకర్ చిత్తూరు జిల్లా మదనపల్లి కి చెందిన పారిశ్రామిక వేత్త. బాగా ఆధ్యాత్మిక భావాలు కలిగిన వాడని అందుకే ముఖ్యమంత్రి ఆయననునియమించాలని భావిస్తున్నట్లు ఈ వర్గాలు చెప్పాయి.

ఇటీవలి దాకా పారిశ్రామికవేత్తకు కాకుండా పార్టీ విధేయుడికి ఈ సారి ఈ పదవి ఇస్తారని భావించారు. నెల్లూరు జిల్లాకు చెందిన బిసి నాయకుడు బీదా మస్తాన్ రావు పేరు వినిపించింది. గత ఛెయిర్మన్ చదలవాడ కృష్ణమూర్తి ఛెయిర్మన్ రిటైర్ అయినతర్వాత ఆ పోస్టుకు ఎవరిని నియమించలేదు. కమ్మకులానికి చెందిన హేమా హేమీల పేర్లు వినబడ్డాయి. టిడిపి లోక్ సభ్యుడు రాయపాటి సాంబశివరావు ఈ పదవి కోసంతీవ్రంగా కృషి చేశారు. ఆ తర్వాత రాజమండ్రి లోక్ సభ సభ్యుడు మురళీ మోహన్ కూడా ఈ పదవిని ఆశించారు. ఈ మధ్యలో ఎన్టీఆర్ కుమారుడు, మాజీ రాజ్యసభ్యుడు నందమూరి హరికృష్ణ పేరు కూడా వినిపించింది. ఎపుడూబాగా పేరున్న బిజినెస్ పీపుల్ కే ఈ పోస్టు పోతా ఉంటుంది. అలాంటిది ఇపుడు బీదా మస్తాన్ రావు పేరు వినపడటం వింతగాఅనిపించింది. 

చంద్రబాబు కొత్త సంప్రదాయం సృష్టిస్తున్నారని అనుకున్నారు. మరేమో ఈ రోజు మళ్లీ పారిశ్రామిక వేత్త పేరు తెరమీదకు వచ్చింది.

డబ్బున్న శ్రీవారి ట్రస్టుకు డబ్బున్న ఛెయిర్మనే బాగుంటాడని ముఖ్యమంత్రి భావిస్తున్నారేమో.