కోడి గుడ్లు పెట్టడం అందరూ చూసే ఉంటారు. మరి ఎప్పుడైనా మనిషి గుడ్లు పెట్టడం చూశారా..? మనిషి ఎక్కడైనా గుడ్లు పెడతాడా అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే నిజంగానే ఓ బాలుడు గుడ్లు పెడుతున్నాడు. ఈ వింత సంఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే..దక్షిణ ఇండోనేషియాకు చెందిన అక్మల్(14) అనే బాలుడు గుడ్లు పెడుతున్నాడు. అక్మల్.. 2016 నుంచి ఇప్పటి వరకు 20గుడ్లు పెట్టడం విశేషం. ఇది ఎలా సాధ్యమైందో అర్ధంకాక.. వైద్యులు సైతం తలలు పట్టుకుంటున్నారు. మల ద్వారం నుంచి ఈ గుడ్లు బయటకు వస్తున్నాయి.

అక్మల్ పెట్టిన గుడ్లను పగల కొట్టి చూడగా.. ఒక గుడ్డులో పచ్చసొన, మరో గుడ్డులో తెల్ల సొన ఉంటున్నాయని బాలుడి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆ గుడ్డు అచ్చం కోడి గుడ్డులాగే ఉందని వైద్యులు చెబుతున్నారు. ‘మనిషి గుడ్డు పెట్టడం అసాధ్యం. మలద్వారం గుండా అక్మల్‌ వీటిని శరీరంలోకి పంపించి ఉండొచ్చు. ఇది మా అనుమానం మాత్రమే. అతణ్ని వారంపాటు మా పరిశీలనలో ఉంచి పరీక్షలు చేపడతాం. దీంతో నిజానిజాలు తేలిపోతాయి’అని డాక్టర్లు చెబుతున్నారు.