విశాఖ ఎయిర్ పోర్టులో తృటిలో తప్పిన ప్రమాదం

IndiGo Fight Makes Emergency Landing  at Vizag Airpor
Highlights

  • . పైలెట్ వెంటనే  గుర్తించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.
  • విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు.

 

 విమానం రెక్కకి చిన్న పిట్ట తగిలినా చాలు....విమానం పేలిపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటిది ఏకంగా ఒక గద్ద ప్రొఫెల్లర్ లో పడిపపోయింది. పైలెట్ వెంటనే  గుర్తించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ ఘటన విశాఖ పట్నంలో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. విశాఖ నుంచి బెంగళూరు వెళ్లేందుకు ఇండిగో విమానం బయలు దేరింది. విమానం టేకాఫ్ అయిన కొద్ది సమయానికే  ప్రొఫెల్లర్ లో గద్దె పడింది. ఈ విషయాన్ని అదృష్టవశాత్తు పైలెట్ వెంటనే గుర్తించారు. జరగబోయే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి.. విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు.

విమానంలో సుమారు 100 మంది ప్రయాణికులు ఉన్నారు.విమానాన్ని అత్యవసరంగా  ల్యాండ్ చేయడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.

జరిగిన విషయాన్ని  తీవ్రంగా పరిగణించిన ఇండిగో సంస్థ ఈ విమాన సంస్థను రద్దు చేసింది. ప్రయాణికుల కోసం మరో విమానానిన సిద్ధం చేశారు. కాగా కొందరు ప్రయాణికులు వారి ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు.

loader