బాబూమోషై బందూక్‌బాజ్ సినిమా వివాదం. బాబూమోషై బందూక్‌బాజ్ సినిమా కట్స్ పై ఫైర్ అయిన బిదితా అస్సలు ఇండియన్లు ముద్దులు పెట్టుకొరని వ్యంగాస్త్రాలు.
ఈ మాట అన్నది బాలీవుడ్ హీరోయిన్ బిదితా. తను నటించిన బాబూమోషై బందూక్బాజ్ సినిమాకు సెన్సార్ బోర్డు అత్యధిక కట్స్ చెప్పడమే కారణం. "బాబూమోషై బందూక్బాజ్" సినిమాలో నవాజుద్దీన్ సిద్దిఖీ కథానాయకుడిగా నటించించారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఎకంగా 48 కట్స్ చెప్పింది. దీని పై సెన్సార్ బోర్డ్ ఛైర్మన్ పహ్లాజ్ కూడా వివరణ ఇచ్చారు.. మాకు ఆ సినిమా పై ప్రత్యేకమైన కక్ష్య లేదని, ఉన్న నిబంధనల ప్రకారం మేము ఆ సన్నివేశాల్ని తొలగించాల్సిందిగా తెలిపారు.
ఇప్పుడు ఈ సినిమాకు చెప్పిన కట్స్ విషయం చర్చనీయాంశం అయింది. ఈ సినిమా లో సిద్దీఖీ, బిదితా మధ్య చుంభన సన్నివేశాలను కూడా తొలగించాల్సిందిగా కొరారు. అందుకు బాలీవుడ్ పెద్దలు నుండి కూడా అభ్యంతరం వ్యక్తం అయింది.
సాధారణంగా సెన్సార్ బోర్డుకు వ్యతిరేకంగా తారాలు నేరుగా మాట్లాడం జరగదు. కానీ ఈ విషయంపై బోర్డ్ తీరు పై బిదితా ఆగ్రహాం వ్యక్తం చేసింది ‘‘భారతీయులు ముద్దులు పెట్టుకోరు, భారతీయులు బూతులు మాట్లాడరు’’ అని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో వ్యంగ్యస్త్రాలు సంధించింది. అంతేకాదు ఆ ఫోటోకు ‘సంస్కారి’, ‘సీబీఎఫీసీ’ అనే ట్యాగ్స్ కూడా జోడించింది.
