5కేజీల ఎల్పీజీ సిలిండర్ ని ప్రవేశపెడుతున్న ఇండియన్ ఆయిల్ 24గంటల సదుపాయం

హైదరాబాద్ ప్రజలకు శుభవార్త.అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న 5 కేజీల ఎల్ పీజీ సిలిండర్లు మార్కెట్ లోకి వస్తున్నాయి. ప్రముఖ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ వీటిని రేపు విడుదల చేయనుంది. హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో దీనిని విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ సిలిండర్ ఐటీ ఉద్యోగులు, వలసదారులు, బ్యాచులర్స్, పర్యాటకులకు ఎంతగానో ఉపయోగపడుతుందని వారు తెలిపారు. ఈ సిలిండర్లు ప్రతిరోజూ 24గంటలు అందుబాటులో ఉంచుతామని కంపెనీ తెలిపింది. ఈ సిలిండర్ పొందడానికి ఎలాంటి డాక్యుమెంటేషన్ అవసరం లేదని.. కేవలం ఐడీ ఫ్రూఫ్ ఉంటే చాలు. బరువు తక్కువగా ఉండటం వల్ల తీసుకొని వెళ్లడం చాలా సులభంగా ఉంటుంది. ఒక వేళ సిలిండర్ ఖాళీ అయితే.. దేశంలో ఎక్కడైనా మళ్లీ ఫిల్ చేసుకోవచ్చు. క్యాష్ బ్యాక్ సదుపాయం కూడా ఉంది.