సైమీస్ కి చేరిన రెండు భారత జట్లుఅద్బుతంగా రాణిస్తున్న న్యాయవాదుల జట్లు.రేపే సెమీ ఫైనల్
శ్రీలంకలో జరుగుతున్న 6వ ప్రపంచకప్‌లో భారత జట్లు ప్రపంచకప్ లో అద్బుత ప్రదర్శనతో దూసుకేళ్తున్నాయి. న్యాయవాదుల ప్రపంచకప్ లో రెండు భారత జట్లు పాల్గోటున్న విషయం తెలిసిందే, అయితే ఇరు జట్లు సెమీస్ కి చేరుకున్నాయి. ఇప్పటికే రెండు జట్లు చేరో ఐదు మ్యాచ్‌లు ఆడాయి.

అందులో భారత్-A జట్టు ఐదు మ్యాచ్‌లకు అన్ని మ్యాచ్‌లల్లో ఘన విజయాన్ని సాధించింది. భారత్ -B జట్టు ఐదు మ్యాచ్ ఆడి అందులో ఒకటి ఓడిపోయింది. మిగత నాలుగు మ్యాచ్‌లు గెలిచింది.
నేడు జరిగిన మ్యాచ్‌లల్లో భారత్-A జట్టు ఆస్ట్రేలియా-B పై ఘన విజయం సాధించింది, మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారత బౌలింగ్ ముందు నిలువలేకపోయారు. ఆస్ట్రేలియా న్యాయవాదులను కేవలం 123 పరుగలకే కట్టడి చేశారు. అనంతరం బ్యాటింగ్ కి దిగిన భారత జట్టు ఒక్క వికెట్ నష్టపోయి కేవలం 9 ఓవర్లకే టార్గేట్ ను చేధించింది.

మరో మ్యాచ్ లో ఆస్ట్రేలియా- ఢ పై భారత్-B న్యాయవాదుల జట్టు ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియన్ లాయర్లు 182 పరుగులు చేశారు. అనంతరం ఆస్ట్రేలియన్ న్యాయవాదులు 20 ఓవర్లకే భారత్-B ఇచ్చిన టార్గేట్‌ను పూర్తి చేసింది.

భారత్ జట్లు ఒక్క మ్యాచ్ లో తప్ప మిగతా అన్ని మ్యాచ్‌లల్లో గెలుపొందాయి.
సేమీఫైనల్
భారత్-A జట్టు X ఆస్ట్రేలియా-A 18వ తేది 9:30 నిమిషాలకు
భారత్-B జట్టు X వెస్టిండీస్ 18వ తేదీ 1:30 నిమిషాలకు
ఇరు జట్లును అభినందిస్తు న్యాయవాదుల ప్రపంచ కప్ సృష్టికర్త అయినా సంతాన కృష్ణ భారత జట్లకు శుభాకాంక్షలు తెలిపారు. తప్పకుండా 6వ న్యాయవాదుల ప్రపంచ కప్ ను భారత్ గెలవాలని ఆయన జట్లుకు సూచించారు. భారత జట్లకు క్రికెటర్ మహ్మద్ కైఫ్ కొన్ని మెలకువలు ఇచ్చారు.

