Asianet News TeluguAsianet News Telugu

భారత న్యాయవాదులు ప్రపంచ కప్ లో చెలరేగుతున్నారు

  • శ్రీలంకలో ప్రారంభమైన న్యాయవాదుల 6వ ప్రపంచ కప్
  • భారత న్యాయవాద జట్లు అద్బుత ప్రదర్శనతో అకట్టుకుంటున్నాయి.
  • భారత-A జట్టు రెండు మ్యాచ్ లల్లో, భారత్-B జట్టు రెండు మ్యాచ్ లల్లో విజయాలు నమోదు.
indian cricket lawyers won 1st match in srilanka

శ్రీలంక‌ వేదికగా జ‌రుగుతున్న 6వ న్యాయ‌వ్యాదుల‌ క్రికెట్ ప్ర‌పంచ‌క‌ప్ లో భార‌త జ‌ట్లు ఘ‌న విజ‌యాలను నమోదు చేసుకున్నాయి. భాారత్-A జట్టు శ్రీలంక పై, భారత్ -B జట్టు బంగ్లాదేశ్ పై విజయాలు నమోదు చేశాయి.

 శ్రీలంక-Aతో ఇండియా-A జ‌ట్టు త‌న మొద‌టి మ్యాచ్ శుక్రవారం ఆడింది. అందులో ఆరు వికెట్ల తేడాతో ఇండియా విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది.

Image result for indian-lawyers-win-six-wickets against sri lanka lawyers

కొలంబోలోని పి. సారా ఓవెల్ వేదిక‌గా ఇండియా-A, శ్రీలంక-A న్యాయ‌వాదుల మ‌ధ్య‌ మ్యాచ్ జ‌రిగింది. మ్యాచ్ లో మొద‌ట శ్రీలంక బ్యాటింగ్ చేసింది. 34.1 ఓవ‌ర్ల‌లో 194 ప‌రుగులు చేసింది. శ్రీలంక-A జ‌ట్టు నుండి అత్య‌ధిక ప‌రుగుల‌ను న‌మోదు చేసింది ఇషాన్ అర‌స‌ర‌త్నం 66 ప‌రుగులు చేశారు (8*4, 1*6, 51 బంతుల్లో).

ఒక ఓవ‌ర్ మిగిలి ఉండ‌గానే ఇండియా-A, శ్రీలంక-A ఇచ్చిన టార్గెట్ ను చేధించింది. భార‌త్ 4 వికెట్లు న‌ష్ట‌పోయి 198 ప‌రుగులు చేసింది. మ్యాచ్ లో ఇండియ‌న్ బ్యాట్స్‌మెన్ సెమీంధ‌ర్ సింగ్ ఎదుర్కొన్న చివ‌రి బంతికి సిక్స్ కొట్టి భార‌త్ విజ‌య‌ప‌తాకం ఎగ‌ర‌వేశాడు. భార‌త బ్యాట్స్ మెన్లు బ్యాటింగ్ లో రాణించారు. సూర‌జ్ సంప‌త్ 46 ప‌రుగులు, సోమిన‌న్ స‌ర్కార్ 43 ప‌రుగులు,  హ‌సర్ అలీ 43 ప‌రుగులు, సెమీంధ‌ర్ సింగ్ 45 నాటౌట్ గా నిలిచారు.

 ఇండియా-B జట్టు బంగ్లాదేశ్-A తో తలపడింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియన్ బ్యాట్స్ మెన్లు  35 ఓవర్లకు ఆరు వికెట్లు నష్టపోయి 266 పరుగులు చేశారు. తరువాత బ్యాటింగ్ కి దిగిన బంగ్లాదేశ్-Aను 100 పరుగుల లోపే అలౌట్ చేశారు. భారత బౌలర్లు కూడా అద్బుతంగా రాణించారు.

 

శనివారం భారత్-A జట్టు బంగ్లాదేశ్ -B తో తలపడింది. భారత బ్యాటింగ్ లైనప్ పరుగుల సునామీ పారించారు. 35 ఓవర్లకు 412 పరుగులు చేశారు. బంగ్లా-B న్యాయవాదుల జట్టు భారత బౌలింగ్ దాటికి తొమ్మిది వికేట్లు నష్టపోయి 35 ఓవర్లకు 120 పరుగులు మాత్రమే చెయ్యగల్గింది. దీనితో భారత్-A జట్టు తన ఖాతాలో రెండవ విజయాన్ని నమోదు చేసుకుంది.

 భారత్-B తన రెండవ మ్యాచ్ లో శ్రీలంక-B జట్టుతో తలపడింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 275 పరుగులు చేసింది. తరువాత భారత్ బౌలింగ్ లో కూడా ఆకట్టుకున్నారు. శ్రీలంక-B జట్టును 170 పరుగులకే కట్టడి చేశారు. భారత్-B జట్టు కూడా తన రెండవ విజయాన్ని నమోదు చేసుకుంది.

మొత్తానికి భారత న్యాయవాద జట్లు సూపర్ విక్టరీలతో ప్రపంచ కప్ లో దూసుకుపోతున్నాయి.

 6వ న్యాయ‌వాదుల ప్ర‌పంచ క‌ప్ లో మొత్తం 8 దేశాల నుండి 12 జ‌ట్టు పాల్గోంటున్నాయి. ప్ర‌స్తుతం జ‌రుగుత‌న్న‌ న్యాయ‌వాదుల ప్ర‌పంచ క‌ప్ ‌ థీమ్ "ఫ్రెండ్షిప్ కోసం క్రికెట్ష‌. మ‌న దేశం నుండి రెండు జ‌ట్లు పాల్గోంటున్నాయి. భార‌త న్యాయ‌వాదుల జ‌ట్ల‌కు మెనేజ‌ర్ గా సిఎల్పి ప్రేసిడెంట్ సంతాన కృష్ణ ప‌నిచేస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios