అద్బుతంగా రాణించిన ఇండియన్ బౌల‌ర్లు

indian bowlers will gets 10 wickets 1st odi
Highlights

తొలి వన్డేలో శ్రీలంక 43.2 ఓవర్లలో 216 పరుగులకే ఆలౌటయింది.

శ్రీలంక ఓపెనర్ డిక్‌వెల్లా చేసిన 64 పరుగులే జట్టులో అత్యధికం.

అధికంగా అక్సర్ పటేల్ మూడు వికెట్లు తీసుకున్నారు. 

శ్రీలంక జరుగుతున్న మొదటి వన్డేలో ఇండియన్ బౌలర్లు అద్బుతంగా రాణించారు. రన్గిరి దంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న తొలి వన్డేలో శ్రీలంక 43.2 ఓవర్లలో 216 పరుగులకే ఆలౌటయింది. భారత్ విజయ లక్ష్యం 217 పరుగులగా నిర్ణయించింది. 

 టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంక 74 పరుగుల వరకు వికెట్ పోకుండా జాగ్రత్తగా ఆడింది. ఒక దశలో 139/2తో పటిష్టంగా కనిపించిన లంకను భారత బౌలర్లు దారుణంగా దెబ్బతీశారు. 166 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన లంక ఆ తర్వాత ఏ దశలోనూ భారత బౌలర్ల దెబ్బకు కోలులేకపోయింది. వరుసగా వికెట్లు కోల్పోతూ 43.2 ఓవర్ల వద్ద ఇన్నింగ్స్‌ను ముగించింది.

శ్రీలంక ఓపెనర్ డిక్‌వెల్లా చేసిన 64 పరుగులే జట్టులో అత్యధికం. మరో ఓపెనర్ గుణతిలక 35, కుశాల్ మెండిస్ 36, మాథ్యూస్ 36 పరుగులు చేశారు. మిగతా బ్యాట్స్మెన్లు రాణించలేదు. చివరకు శ్రీలంక 2016 పరుగులకే అలౌట్ అయింది. 

భారత్ బౌలింగ్ బృందం సూపర్ బౌలింగ్ తొో అకట్టుకుంది. అధికంగా అక్సర్ పటేల్ మూడు వికెట్లు తీసుకున్నారు. బుమ్రా, వైఎస్ చాహల్, జాదవ్ లు తలో రెండు వికెట్లతో లంక తక్కువ స్కోర్ కే 10 వికెట్లు తీసుకున్నారు.

 

భారత బ్యాట్స్ మెన్లు బ్యాటింగ్ దిగారు.

loader