ఇండో అమెరికన్లకు రక్షణ కల్పించాలని వారు వైట్ హౌజ్ వద్ద వద్ద డిమాండ్ చేశారు.

తమ వారిపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఈ రోజు అమెరికా అధ్యక్ష నివాసం వైట్ హౌజ్ వద్ద ఇండో అమెరికన్లు ఆందోళన చేపట్టారు.

ఇటీవల భారతసంతతికి చెందిన కూచిభొట్ల శ్రీనివాస్ తో సహా మరో ఇద్దరు అమెరికాలో జాత్యాహంకార దాడులకు బలైపోయిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఇండో అమెరికన్లకు రక్షణ కల్పించాలని వారు వైట్ హౌజ్ వద్ద వద్ద డిమాండ్ చేశారు.

దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. జాత్యాహంకార దాడులకు పాల్పడేవారిని కఠినంగా శిక్షిచాలన్నారు.