ఇన్నింగ్స్ 54 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం ఐదు వికెట్లు సాధించిన జడేజా రెండు విజయాలు సాధించిన ఇండియా.
ఇండియా మరో ఘన విజయాన్ని తన ఖాతలో వేసుకుంది. శ్రీలంకతో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 53 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక కు ఇండియన్ స్పిన్నర్లు చుక్కలు చూపించారు. మొదటి ఇన్నింగ్స్ లో అశ్విన్ 5 వికెట్లు పడగొట్టాడు, రెండవ ఇన్నింగ్స్ లో జడేజా 5 వికెట్ల తీశారు. తొలి ఇన్నింగ్స్ 439 పరుగులు వెనుకబడి ఫాలోఆన్ ఆడిన ఆతిథ్య జట్టు 386 పరుగులకు ఆలౌటైంది. కరుణరత్నె(141), మెండిస్(110) శతకాలతో రాణించారు. మిగత లంక బ్యాట్స్‌మెన్లు భారత బౌలర్ల ముందు నిలవలేకపోయారు.

రెండవ ఇన్నింగ్స్ లో భారత బౌలర్లలో జడేజా 5 వికెట్లు, అశ్విన్ 2, హార్దిక్ పాండ్య 2, ఉమేష్ యాదవ్ 1 వికెట్ తీసుకున్నారు. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్‌ను భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే చేజిక్కించుకుంది.
మూడవ టెస్ట్ మ్యాచ్ ఆగష్టు 12 వ తేదీన ప్రారంభమవుతుంది.
