అమ్మాయిలు అదరగొట్టారు

First Published 4, Dec 2016, 9:54 AM IST
India womens team won Asia Cup
Highlights
  • ఆసియాకప్ టీ 20 విజేత భారత్
  • ఫైనల్ లో పాక్ పై విజయం

భారత మహిళల క్రికెట్ జట్టు అదరగొట్టింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను ఫైనల్ లో ఓడించి  ఆసియాకప్‑ ట్వంటీ 20 టోర్నీ  విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ లో పాక్ పై  17 పరుగుల తేడాతో గెలిచి భారత మహిళ జట్టు రికార్డు విజయాన్ని సాధించింది.

 

మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఐదు వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. మిథాలీ రాజ్  73 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది.ఒంటరి పోరుతో జట్టుకు విలువైన పరుగులు అందించింది. జులాన్ గోస్వామి(17) మిథాలి తర్వాత టాప్ స్కోరర్ గా నిలిచింది. మిగితా ఎవరూ అనుకున్న స్థాయిలో ఆడలేదు.


122 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ టపా టపా వికెట్లు పోగొట్టుకుంటూ 104 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులో అయేషా జాఫర్(15), జావిరియా ఖాన్(22), బిస్మా మరూఫ్(25) లు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు.

 

loader