Asianet News TeluguAsianet News Telugu

మొదటి రోజు త‌డ‌బడిన భార‌త్‌

  • మిడిలార్డర్ వైపల్యంతో తక్కువ తగ్గిన స్కోర్
  • రాణించిన ఓపెనర్లు, శిఖర్ ధావన్ సెంచరీ
  • 48 పరుగులకు అవుట్ అయిన విరాట్ కోహ్లీ.
india was try hard to get score

శ్రీలంక‌తో జ‌రుగుతున్న మూడ‌వ టెస్టులో మిడిల్ ఆర్డ‌ర్ బ్యాట్స్‌మెన్లు త‌డ‌బ‌డ్డారు. మొద‌ట ఓపెన‌ర్లు రాణించిన భారీ స్కోర్ చెస్తుంద‌నుకున్న ఇండియా మిడిలార్డ‌ర్ వైప‌ల్యంతో మొద‌టి రోజు ఆరు వికేట్ల న‌ష్టానికి 329 ప‌రుగులు చేసింది.

అయితే కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మ్యాచ్ లో అనూహ్యంగా అవుట్ అయ్యారు.  అర్థ సెంచ‌రీకి చేరువైనా విరాట్‌, సందకన్‌ వేసిన బంతి పిచ్ పై ప‌డిన త‌రువాత‌ అనూహ్యంగా ఆఫ్‌సైడ్‌ టర్న్‌ తీసుకుంది. దీనితో డిఫెన్స్ చేసిన‌ కోహ్లీ త‌న‌ బ్యాట్‌ అంచును తాకింది. అంతే స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న కరుణరత్నె చేతికి ప‌డింది.  దీంతో అస‌హానంతో కోహ్లీ పెవిలియ‌న్ బాట ప‌ట్టాడు. విరాట్ కోహ్లీ 84 బంతుల్లో 42 ప‌రుగులు చేశారు.

shikhar dhawan, dhawan hundred, india vs sri lanka

మొద‌టి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ఇండియా ఆరు వికెట్ల న‌ష్టానికి 329 ప‌రుగులు చేసింది. శిఖ‌ర్ ధావ‌న్ సెంచ‌రీతో ఆక‌ట్టుకున్నారు. ఓపెన‌ర్ లోకేష్ రాహుల్ కూడా అద్బుత‌మైన బ్యాటింగ్ తో 85 ప‌రుగులు చేశాడు, ఛ‌టేశ్వ‌ర్ పూజ‌రా 8 ప‌రుగులు, విరాట్ కోహ్లీ 42 ప‌రుగులు, అజింక్యా ర‌హానే 17 ప‌రుగులు, ర‌విచంద్ర అశ్విన్ 31 ప‌రుగులు, ప్ర‌స్తుతం వృద్దిమాన్ స‌హా 13 ప‌రుగులు, హ‌ర్ధిక్ పాండ్యా 1 ప‌రుగుతో బ్యాటింగ్ చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios