విరాట్ కోహ్లీకి ప్రమాదం... నెక్ట్స్ టీ20కి దూరం

First Published 19, Feb 2018, 12:22 PM IST
India vs South Africa Injury Scare For Virat Kohli In First T20I
Highlights
  • విరాట్ కోహ్లీ కాలికి గాయం
  • నెక్ట్స్ టీ20 ఆడకపోయే అవకాశం

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కి గాయమైంది. దీంతో.. కోహ్లీ.. తర్వాత జరగనున్న టీ 20 మ్యాచ్ కి దూరం అయ్యే పరిస్థితి కనపడుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

ఆదివారం భారత్, దక్షిణాఫ్రికాల మధ్య టీ 20 మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి భారత్ బ్యాటింగ్ కి దిగింది.ఈ క్రమంలో  బ్యాటింగ్ చేస్తుండగా.. కోహ్లీ కాలికి గాయమైంది. అనంతరం ఎల్బీడబ్ల్యూ రూపంలో కోహ్లీ ఔట్  అయ్యాడు. కాగా.. ఫీల్డింగ్ సమయంలో కాలి నొప్పి మరింత ఎక్కువ కావడంతో.. ఫీల్డింగ్ చేయలేక.. మైదానం నుంచి బయటకు వెళ్లిపోయాడు. విరాట్ కాలికి గాయమైన విషయం తెలిసి అభిమానులు ఆవేదన చెందుతున్నారు.

ఇదిలా ఉండగా బుధవారం జరగనున్న తదుపరి 20టీ మ్యాచ్ లో కోహ్లీ ఆడకపోవచ్చనే అనుమానులు వ్యక్తమౌతున్నాయి. కోహ్లీ ఆడకపోతే.. కెప్టెన్ బాధ్యతలు రోహిత్ శర్మకు అప్పగించే అవకాశం ఉంది.

loader