Asianet News TeluguAsianet News Telugu

30సం. లోపున్న కుర్రోళ్లందరికి గుడ్ న్యూస్

2018లోపున్న మన కుర్రవాళ్లు మంచి వార్త వినబోతున్నారు. 2018లో రిక్రూట్ మెంట్ పెరగడంతో పాటు వారి  వేతనాలు బాగానే ఉంటాయి.

India Inc promising better pay hikes for the right talent in 2018

ఇక ముందు తక్కువ జీతాలతో సర్దుకుపోనవసరం లేదు. తొందర్లో భారతదేశంలో ప్రయివేటు రంగంలో జీతాలు పెరగబోతున్నయి. అది కూడా వచ్చే ఏడాదినే ఈ తీపికబురు ‘రైట్ టాలెంట్’ ఉన్న ఉద్యోగుల చెవిన పడనుంది. అనేక జాబ్ మార్కెట్ సంస్థలు ఈ మేరకు తమ అధ్యయనాలను విడుదల చేశాయి.

ఇక్కడ రైట్ టాలెంట్ మాట ఉంది. దానిని మర్చిపోవద్దు. ‘రైట్ టాలెంట్’ మారుతున్న కాలానికి తగ్గ ట్టు కొంత కోర్సులు, అడ్వాన్స్ డ్ రంగాలలో శిక్షణ ఉండాలి. కొత్త స్కిల్స్ పెంచుకోవాలి. లేకుండా ఇపుడు 2018లో మీరు వెనకబడిపోతారు.  అయితే, కంపెనీలో టెంపరరీ ఉద్యోగాలే ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు, మరొక విషయం, కంపెనీలు రిటైరయిన వారిని నియమించుకునేందుకు పూనుకుంటాయి. అయితే, 30 సం. లోపున్న యువకులు, కొత్త స్కిల్స్ తో ముందుండాలి. లేకపోతే, అంతే... వివరాలివిగో

2017లో ఉద్యోగ రంగం ఒక్క కుదుపునకు గురయిన సంగతి తెలిసిందే. డీమానెటైజేషన్, రోబోల ప్రవేశం తదితర  పరిణామాల వల్ల  అనేక రంగాలలో ఉద్యోగాలు పడిపోయాయి. ముఖ్యంగా టెక్సటైల్ రంగం పెద్ద కుదుపునకు గురయింది.

అయితే,  2018లో భారత ఉద్యోగులు మంచి వార్త వినబోతున్నారు. రిక్రూట్ మెంట్ పెరగడంతో పాటు వారి  వేతనాలు 10-15 శాతం వరకూ వేతన పెంపు ఉంటుందని ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ ‘మ్యాన్ పవర్ ’ గ్రూప్‌ తీసుకువచ్చే ‘ఎకనమిక్ అవుట్ లుక్’  ఈ అంచనాలు చేసింది. ఈ రిపోర్టు ప్రకారం, 2017 లో తొలుత ఉద్యోగాలు బాగా పడిపోయియి. తర్వాత నాలుగో క్వార్టర్ అంటే అక్టోబర్-డిసెంబర్ కాలంలో మళ్లీ పెరగడం మొదలయ్యాయి. 2017 జనవరి-మార్చిలో ద్యోగాల రిక్రూట్  22 శాతానికి పడిపోయింది. తర్వాత క్వార్టర్ లో 19 శాతానికి పడిపోయింది. మూడో క్వార్టర్ అంటేజూలై-సెప్టెంబర్ ఇది 16 శాతానికి దిగిపోయింది. అయితే, అక్టోబర్ –డిసెంబర్ క్వార్టర్ లో 24శాతానికి పుంజుకుంది.

అయితే,2018లో  ఈ సీన్ మారిపోతున్నదని ఈ రిపోర్టు చెబుతున్నది. ఎందుకో తెలుసా? మొబైల్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగం, ఫిన్ టెక్, స్టార్ట్ అప్ లద్వారా నియామకాలు పెరుగనున్నాయి. ఇంతకంటే, ముఖ్యంగా ఉద్యోగాలలో  10 నుంచి 15 శాతం దాకా జీతాలు పెరిగే అవకాశం ఉంది.

‘2018లో ఉద్యోగాల నియమాకాలు ఊపందుకోనున్నాయి. అన్ని రంగాలలో బిజినెస్ పెరుగనుంది. ముఖ్యంగా ఫైనాన్సియల్ సర్వీసెస్, రిటైల్, ఇ-కామర్స్, మీడియా, ఎంటర్ టైన్ మెంట్ తదితర రంగాలన్నీ పెద్ద ఎత్తున ఉద్యోగాల నియామకాలు జరుపనున్నాయి,’అని టీమ్ లీజ్ సర్వీసెస్ ప్రతినిధి రితుపర్ణ చక్రవర్తి చెబుతున్నారు.

అయితే, ఇక్కడొక మెలిక ఉందని ఈ సంస్థలన్నీ చెబుతున్నాయి. 2018లో వచ్చే ఉద్యోగాలన్నీ కొత్త స్కిల్స్ ఉన్న వాళ్లకే నని మర్చిపోరాదని ఈ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఇపుడున్న స్కిల్స్ అవుడ్డేట్ అయిపోయాయి. మామూలు ఐటి స్కిల్స్  పనయిపోయిందది. డేటా సైన్స్, డిజిటల్ స్కిల్స్ కి డిమాండ్ ఉంటుందని ప్రముఖ జాబ్ పోర్టల్ shine.com సిఇవొ జైరస్ మాస్టర్ చెబుతున్నారు.

ఇండియా జాబ్ మార్కెట్ సీన్ బాగా మారిపోతాందండోయ్. టెంపొరరీ, ఫ్లెక్సీ ఫోర్స్ బాగా పెరిగిపోతున్నది. ఇపుడు భారత దేశ ఉద్యోగాలలో 13 లక్షల మంది ఫ్లెక్సిఫోర్స్. వీరి సంఖ్య 2025 నాటికి 90 లక్షలకు పెరగనుంది కంపెనీలన్నీ ఫుల్ టైం ఉద్యోగాలు మానేసి ఫ్రీలాన్సర్స్ ని హైర్ చేసుకోబోతున్నాయి. దీనితో పాటు రిటైరయిన వారిని, పూర్వ ఉద్యోగులను, ఆన్ లైన్ టాలెంట్ ని హైర్ చేసుకోబోతున్నాయి.

ఇంకొక విషయం. 2018లో సోషల్ మీడియా ద్వార రిక్రూట్ మెంట్ అధికంగా ఉంటుందట. అసెస్మెంట్ ఎక్కుగా ఆన్ లైన్ ద్వారా జరుగుతందట. మంచి ప్రావీణ్యం ఉన్న వాళ్లనే రిక్రూట్ చేసుకునేందుకు కంపెనీలు ఇష్టపడుతాయి.

జాబ్ మార్కెట్ నిపుణుల అధ్యయనం  ప్రకారం సోషల్ మీడియా ఇండియాలో ఇంకా ఉధృతం కావలసి ఉంది. ఇండియా జనాభాఏమో 1200 మిలియన్లు. ఇందులో ఇంటెర్నెట్ వాడే వాళ్ల సంఖ్య కేవలం 243.2 మిలియన్లు. అందులో సోషల్ మీడియా యాక్టివ్ యూజర్లు ఇంకా తక్కువ. కేవలం 106 మిలియన్లే. అందువల్ల  యువకులంతా సోషల్ మీడియా యాక్టివ్ యూజర్లు కావలసి ఉంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios