భారీ స్కోర్ సాధించిన ఇండియా. నలుగురు బ్యాట్స్ మెన్లు అర్థ సెంచరీ తో ఆకట్టుకున్నారు. ఆదిలోనే రెండు వికెట్లు కొల్పొయిన లంక మొదటి రొజు ఇద్దరు ఇండియన్లు సెంచరీలు సాధించారు.
కొలంబో వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్నమ్యాచ్ లో శ్రీలంక తొలి ఇన్నింగ్స్ ఆరంభించింది. ఆతిథ్య జట్టు ఆదిలోనే రెండు వికెట్లు కొల్పొయింది. తరంగా సున్నాకే వికెట్ ను ఔటయ్యాడు. కరుణరత్నే 25 పరుగుల చేసి అశ్విన్ బౌలింగ్ లో వెనుదిగాడు. ప్రస్తుతం క్రీజులో కుశాల్ మెండీస్ 16 పరుగులతో, ఛండిమాల్ 8 పరుగులతో ఉండగా… శ్రీలంక స్కోర్ రెండవ రోజు ఆట ముగిసే సమయానికి 50/2. పరుగులు చేసింది
అంతకు ముందు ఇండియన్ బ్యాట్స్ మెన్లు రానించారు. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 622/9 వద్ద డిక్లేర్డ్ చేసింది. మొదటి రోజు 344/3 ముగిసింది. ఇక రెండో రోజు ఆటను ప్రారంభించిన కోహ్లీ సేన మరో 278 పరుగులు జోడించింది. అప్పటికే పుజారా. రహానేలు సెంచరీలు చెయ్యగా నేడు నలుగురు బ్యాట్స్‌మెన్లు అర్థ శతకాలు చేయ్యడంతో ఇండియా 622 పరుగులు చేసింది. భారత బ్యాట్స్ మెన్లలో పుజారా(133), రహానే(132) శతకాలు నమోదు చేయగా, రవీంద్ర జడేజా(70 నాటౌట్), సాహా(67), రాహుల్(57), అశ్విన్(54) అర్ధ శతకాలతో రాణించారు. 622 పరుగులకు తొమ్మిది వికెట్లు కొల్పోయింది. అనంతరం భారత్ డిక్లెర్ ప్రకటించింది.
లంక బౌలర్లలో హెరాత్ 4, పుష్పకుమార 2, పెరీరా, కరుణారత్నే తలో వికెట్ తీశారు.
