ఇండియాలో నెట్ వేగం పెరిగింది. రైల్వే స్టేషన్లలో అధిక స్పీడ్. లండన్,శాన్ ప్రాన్సీస్కో కన్న అధికం.
ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ సూపర్ స్పీడ్ ట్రైన్ కంటే వేగంగా పరుగెడుతుంది. ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగిన క్షణాలలో తెలిసిపోతుంది. కారణం అంతర్జాలం. గతంలో కంటే ఇప్పుడు 4జీ స్పీడ్ తో డెటా మన చేతుల్లో ఉంటుంది. గత మూడు సంవత్సరాలుగా ఈ స్పీడ్ అధికం అయింది. మిగతా దేశాల కంటే మన ఇండియాలో జియో ప్రవేశం తరువాత ఎక్కువ మంది 4జీ స్పీడ్ డేటాను ఉపయోగిస్తున్నారు.
ఇక దేశంలో నూతనంగా రైల్వే శాఖ 200 స్టేషన్లలో వైఫై రౌటర్లను ప్రవేశపెట్టింది. కేంద్ర రైల్వే శాఖ నెట్ ను 50 ఎంబీపీఎస్ వేగంతో గూగుల్ సహాకారంతో అందిస్తుంది. ఇప్పటి వరకు 100 స్టేషన్లలో పనులు పూర్తయాయి. మరో 100 స్టేషన్లకు పనులు ప్రారంభయ్యాయి.
గూగుల్ తాజా నివేధిక ప్రకారం శాన్ ఫ్రాన్సిస్కొ, లండన్ నగరంలో కంటే ఇండియా రైల్వే స్టషన్లలో అత్యధిక వేగవంతమైన ఇంటర్నేట్ ను వాడుతున్నారని తెలిపింది. లండన్ నగరంలో సగటున 20ఎంబీపీఎస్ స్పీడ్ ను వాడుతున్నారు. కానీ ఇండియా రేల్వే స్టేషన్‌ల్లో సగటున 50 ఎంబీపీఎస్ వేగం కల్గిన వైఫైను వాడుతున్నారని, అక్కడి కన్న 30 ఎంబీపీఎస్ డెటాను అధికమని గూగుల్ తెలిపింది.
భారతదేశ వ్యాప్తంగా చూస్తే అంతర్జాలం స్పీడ్ గణనీయంగా పెరిగింది. కారణం జియో సిమ్‌లు అని గూగుల్ తెలిపింది
