Asianet News TeluguAsianet News Telugu

జూలై 1 నుంచి ఆధార్ లేకుంటే నరకమే

జూలై 1, 2017 చరిత్ర లో ఒక మైలురాయి కాబోతున్నది. ఆ  రోజు నుంచి వస్తు,సేవల పన్ను(జిఎస్‌టి) చట్టం  అమల్లోకి వస్తుంది. దానితో పాటే ఇంకా అనేక మార్పులకు జూలై 1, 2017 తలుపులు తెరుస్తూ ఉంది. ఆ రోజు నుంచి భారత దేశం ఆధార్ చుట్టూ తిరగడం మొదలుపెడుతుంది.

india begins to revolve around Aadhar from July 1 2017

జూలై 1, 2017 చరిత్ర లో ఒక మైలురాయి కాబోతున్నది. ఆ  రోజు నుంచి వస్తు,సేవల పన్ను(జిఎస్‌టి) చట్టం  అమల్లోకి వస్తుంది. దానితో పాటే ఇంకా అనేక మార్పులకు జూలై 1, 2017 తలుపులు తెరుస్తూ ఉంది. ఆ రోజు నుంచి భారత దేశం ఆధార్ చుట్టూ తిరగడం మొదలుపెడుతుంది.


అధార్ అన్నింటికి తప్పనిసరికాదు అనికోర్టులు ఎన్ని సార్లో చెప్పినా,  ప్రభుత్వం భారతీయులు జీవితాన్ని ఆధార్ తో ముడేస్తూ ఉంది.ఆదాయ పన్నుకట్టడం  దగ్గిర్నుంచి చౌక దుకాణంలో బియ్యం తీసుకునే వరకు అన్నింటికీ ఆధార్ సాక్ష్యం కావాలి.


ఆదార్ ఎలా ఇక ముందు భారతీయుల జీవితాలను శాసిస్తుందో కొన్ని ఉదాహరణలు -


*పాన్‌ కార్డుతో ఆధార్‌ అనుసంధానం ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇక నుండి పాన్‌కార్డు ఇవ్వాల్సిన చోట ఆధార్‌ నెంబర్‌ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ట్యాక్స్‌ ఎగ్గొట్టేందుకు ఒక్కరే అనేక పాన్‌ కార్డులు వాడడాన్ని నిరోధించే పేరుతో పాన్‌ తో ఆధార్‌ ఈ రెండింటిని ముడేయడం తప్పని సరి చేశారు.


*పాన్‌కార్డు ను ఆధార్‌తో అనుసంధానం చేయకపోతే ఆదాయపన్ను చట్టం ప్రకారం వాళ్ల పాన్‌ కార్డ్‌ చెల్లుబాటు కాదు.
ఆదాయపన్ను రిటర్న్స్‌ దాఖలు చేయడానికి ప్రభుత్వం ఆధార్‌ను జత చేయడాన్ని తప్పనిసరి చేసింది. ఇది జులై ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.


*కొత్త పాన్‌ కార్డ్‌ తీసుకోవాలంటే ఆధార్‌ నెంబర్‌ కలిగి ఉండడం తప్పనిసరి. ఈ శనివారం తర్వాత ఆధార్‌ లేకుండా కొత్త పాన్‌ కార్డ్‌ తీసుకోవడం సాధ్యపడదు. 
పాస్‌పోర్ట్‌ పొందాలంటే తప్పనిసరిగా ఆధార్‌ నెంబర్‌ జతచేయాలని విదేశీ వ్యవహారాల శాఖ నిర్ణయించింది. జులై ఒకటో తేదీ నుంచి ఆధార్‌ లేకుండా పాస్‌పోర్ట్‌ పొందడం అసాధ్యం 


*జూన్‌ 30వ తేదీ నుండి పిఎఫ్‌ అకౌంట్‌ను ఆధార్‌తో అనుసంధానం చేస్తూ ఎంప్లాయిస్‌ ప్రొవిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఆధార్‌ అనుసంధానం కారణంగా పిఎఫ్‌ మొత్తాలు విత్‌ డ్రాలకు, సెటిల్‌మెంట్‌కు 20 రోజులకు బదులుగా పది రోజుల్లోనే పూర్తయిపోతాయి. 


*రైల్వే రాయితీల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు భారత రైల్వే శాఖ జులై ఒకటో తేదీ నుంచి రాయితీలు పొందే సమయంలో ఆధార్‌ నెంబర్‌ ను తప్పనిసరిగా జత చేయాలని నిర్ణయించింది. 

*మానవ వనరుల అభివృద్ది శాఖ కూడా స్కూల్స్‌, కాలేజీ విద్యార్దు లకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కొత్తగా స్కాలర్‌షిప్పులు కావాలనుకునే వారు, ఇప్పటికే స్కాలర్‌షిప్పులు పొందుతున్న వారు జూన్‌ 30 నాటి కల్లా తప్పనిసరిగా ఆధార్‌ను పొందుపరచాల్సిందే. 


*ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రయోజనాలను ఆధార్‌తో అనుసంధానం చేశారు. సబ్సిడీపై రేషన్‌ సరుకులు తీసుకునేందుకు లబ్దిదారులు జులై ఒకటో తేదీ లోపు ఆధార్‌ నెంబర్‌ను రేషన్‌ డీలర్లకు అందజేయాల్సి ఉంటుంది.

Follow Us:
Download App:
  • android
  • ios